High Risk Warning for Apple Users:యాపిల్ యూజర్లకు అలర్ట్. సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ఐఫోన్, ఇతర యాపిల్ డివైజ్‌ల వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా పాత సాఫ్ట్‌వేర్ వెర్షన్‌తో పనిచేసే డివైజ్‌లకు ఈ అలర్ట్ ప్రకటించింది.
ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ వంటి వాటిని వినియోగించే వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చిరించింది. వీటిలో తీవ్రమైన భద్రతా లోపాలను గుర్తించినట్లు తెలిపింది. ఇవి సైబర్ నేరాలను ప్రోత్సహించేలా ఉన్నాయని పేర్కొంది. దీంతో తమ డివైజ్‌లను వెంటనే అప్డేట్ చేసుకోవాలని ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సూచించింది.
ఏ డివైజ్‌లకు ఈ హెచ్చరిక?:యాపిల్ పాత సాఫ్ట్‌వేర్ వెర్షన్‌తో పనిచేసే డివైజ్‌లకు ఈ హెచ్చరికలు. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్, సఫారీ వంటి ప్రొడక్ట్స్ ఈ లిస్ట్‌లో ఉన్నాయి.
- iOS: 18.1.1 కంటే పాత వెర్షన్స్
- iPadOS: 17.7.2 కంటే పాత వెర్షన్స్
- macOS:15.1.1 కంటే పాత వెర్షన్స్
- సఫారి:18.1.1 కంటే పాత వెర్షన్స్
వీటిలో మీ వద్ద ఉన్న యాపిల్ డివైజ్ పాత వెర్షన్‌తో రన్ అవుతున్నట్లయితే అది సైబర్ బెదిరింపులకు గురయ్యే అవకాశం ఉంది.