Centre Issues High-Risk Warning For IPhone Users :యాపిల్ యూజర్లకు కేంద్రం (హై-రిస్క్ అలర్ట్) భద్రతాపరమైన హెచ్చరికలు చేసింది. ఐఫోన్, మ్యాక్‌బుక్స్, ఐప్యాడ్స్, విజన్ ప్రో హెడ్ సెట్లలో పలు సెక్యూరిటీ లోపాలు ఉన్నట్లు తెలిపింది.
యాపిల్ ప్రొడక్టుల్లో 'రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్'కు సంబంధించి క్లిష్టమైన సెక్యూరిటీ లోపం ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ 'కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా' (CERT-In) గుర్తించింది.
హ్యాకింగ్ జరిగే అవకాశం!
యాపిల్ ప్రొడక్టుల్లోని ఈ సెక్యూరిటీ లోపం వల్ల హ్యాకర్లు ఏకపక్షంగా కోడ్‌ను ఎగ్జిక్యూట్ చేసే అవకాశం ఉంది. అంటే మన డివైజ్‌లను రిమోట్‌గా ఆపరేట్ చేసే ముప్పు ఉందని సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సెర్ట్-ఇన్ హెచ్చరించింది. అందువల్ల యూజర్లు వెంటనే తమ డివైజ్‌లను లేటెస్ట్ సెక్యూరిటీ వెర్షన్‌తో అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్ 17.4.1, 16.7.7 కంటే ముందటి వెర్షన్లలో ఈ సెక్యూరిటీ లోపాలు ఉన్నాయి. అలాగే సఫారీ 17.4.1, మ్యాక్‌ఓఎస్ వెంట్యురా 13.6.6, మ్యాక్‌ఓఎస్ సొనోమా 14.4.1, యాపిల్ విజన్ ఓఎస్ 1.1.1 కంటే ముందటి వెర్షన్లలోనూ ఈ భద్రతాపరమైన లోపాలను గుర్తించినట్లు సెర్ట్-ఇన్ పేర్కొంది.