WhatsApp New Feature: ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో మరో అద్భుతమైన ఫీచర్ వస్తోంది. ఈ ఫీచర్ సహాయంతో వినియోగదారులు ఇకపై స్టిక్కర్ ప్యాక్‌లను ఇతరులకు యాప్ నుంచి నేరుగా షేర్ చేయొచ్చు. iOS, Android రెండింటిలోనూ ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. అయితే వాట్సాప్ లేటెస్ట్ బీటా వెర్షన్లను డౌన్లోడ్ చేసుకున్న వినియోగదారులు మాత్రమే ఈ స్టిక్కర్ ప్యాక్ ఫీచర్‌ను ఎంచుకోగలుగుతారు.
వాట్సాప్‌లో తెలిపిన సమాచారం ప్రకారం..గూగుల్ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న లేటెస్ట్ వాట్సాప్ బీటా వెర్షన్ 2.24.25.2 (లేదా కొత్తది) అప్‌డేట్ చేసుకోవడం ద్వారా ఆండ్రాయిడ్ యూజర్లు దీన్ని ఎంచుకోవచ్చు. ఇక టెస్ట్‌ఫ్లైట్‌లో అందుబాటులో ఉన్న వాట్సాప్ బీటా వెర్షన్ 24.24.10.72ను అప్‌డేట్ చేసుకోవడం ద్వారా iOS యూజర్లు ఈ కొత్త ఫీచర్‌ను సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఆ తర్వాత వారు ఈ స్టిక్కర్ ప్యాక్‌లను ఇతర వాట్సాప్ వినియోగాదారులతో షేర్ చేసుకోగలరు. తద్వారా స్టిక్కర్ ప్యాక్‌లను అందుకున్న యూజర్ తమ మొబైల్లో సేమ్ స్టిక్కర్ ప్యాక్‌ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లో కంటెంట్‌ను ఫార్వార్డ్ చేసేటప్పుడు మెసెజ్‌ను యాడ్ చేసేందుకు కొద్దిమంది టెస్టర్లను వాట్సాప్ అనుమతించడం కూడా ప్రారంభించింది. దీంతో ప్రస్తుతం బీటా టెస్టర్‌లు మొత్తం స్టిక్కర్ ప్యాక్‌లను వారి కాంటాక్ట్‌లకు షేర్ చేయగలుగుతున్నారు.