Useful Gmail Settings On Android : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ జీమెయిల్ వాడుతున్నారు. స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, కంప్యూటర్ ఉన్న ప్రతి ఒక్కరికీ జీమెయిల్ అకౌంట్ తప్పనిసరిగా ఉంటోంది. మరీ ముఖ్యంగా మనం స్మార్ట్‌ఫోన్ వాడాలంటే కచ్చితంగా జీమెయిల్ అవసరం ఉంటుంది. అయితే మనకు తెలియకుండా ఎన్నో మెయిల్స్ వచ్చి ఇన్‌బాక్స్ నిండిపోతూ ఉంటుంది. వీటిలో అనవసరమైన మెయిల్స్ చాలా ఉంటాయి. దీంతో గూగుల్ ఇచ్చిన లిమిట్ కూడా పూర్తవుతుంది. అలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలన్నా, జీమెయిల్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత ఇంప్రూవ్ చేయాలనుకున్నా, ఇక్కడ తెలిపిన 5 సెట్టింగ్స్ మార్చుకుంటే సరిపోతుంది.
1. మీట్ ట్యాబ్‌ను టర్న్ ఆఫ్ చేయండి : మీరు జీమెయిల్లో వీడియో కాల్స్ మీటింగ్స్ లాంటి చేయకపోతే, వెంటనే Meet Tabను టర్న్ ఆఫ్ చేసుకోవడం మంచిది. దీని వల్ల మీకు అనవసరమైన ఇబ్బంది తప్పుతుంది. ఇందు కోసం -
- ముందుగా మీ ఫోన్‌లోని జీమెయిల్ యాప్‌ను తెరవండి.
- సెర్చ్ బాక్సులో మూడు-చుక్కల మెను బటన్‌ను నొక్కండి.
- హాంబర్గర్ మెనుపై క్లిక్ చేసి దిగువన ఉన్న సెట్టింగ్‌లను నొక్కండి .
- జాబితాలోని మీ జీమెయిల్ ఖాతాను ఎంచుకోండి.
- సెట్టింగ్స్‌లోకి వెళ్లి మీట్ సెక్షన్‌ను ఎంచుకోండి.
- Show the meet tab for video calling ఆప్షన్‌ను టర్న్ ఆఫ్ చేయండి
2. డిఫాల్ట్ నోటిఫికేషన్ కస్టమైజేషన్ :జీమెయిల్ యాప్‌లో డిఫాల్ట్ నోటిఫికేషన్‌ను కస్టమైజ్ చేసుకోవవచ్చు. మీకు వచ్చిన నోటిఫికేషన్‌లను నేరుగా ఆర్కైవ్ చేయాలన్నా లేదా తొలగించాలనుకున్నా, ఈ సెట్టింగ్‌ని మార్చుకోవచ్చు. దీని వల్ల మీ సమయం, శ్రమ ఆదా అవుతుంది. ముఖ్యంగా అనవసరమైన మెయిల్స్‌ను, స్పామ్ మెయిల్స్‌ను నోటిఫికేషన్ రాగానే డిలీట్ చేసుకోవడానికి వీలవుతుంది. దీని కోసం-
- ముందుగా మీ Gmail యాప్‌ను తెరిచి, మూడు-చుక్కల మెను బటన్‌ను నొక్కండి.
- "సెట్టింగ్‌లు", ఆపై "జనరల్ సెట్టింగ్‌లు" ఎంచుకోండి.
- చివరగా, "డిఫాల్ట్ నోటిఫికేషన్ యాక్షన్"పై నొక్కండి.
- మీరు డిఫాల్ట్ యాక్షన్‌గా "డిలీట్" ఆప్షన్‌ను ఎంచుకోండి. అంతే సింపుల్!
3. స్వైప్ యాక్షన్ :జీమెయిల్ యాప్‌లో స్వైప్ యాక్షన్‌ను కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు.
- స్వైప్ యాక్షన్స్ కస్టమైజ్ చేయడానికి జీమెయిల్ యాప్‌ని తెరిచి, మూడు-చుక్కల మెను బటన్‌ను నొక్కండి.
- "సెట్టింగ్‌లు", ఆపై "జనరల్ సెట్టింగ్‌లు" ఎంచుకోండి.
- లెఫ్ట్ లేదా రైట్ స్వైప్ యాక్షన్స్‌ను ఎనేబుల్ చేసుకోవాలి.
- ఇలా చేసి మీ మెయిల్స్ ఆర్కైవ్ చేయడం, తొలగించడం, మార్క్ యాజ్ రీడ్, అన్‌రీడ్, మూవ్ టూ, స్నూజ్ లాంటి ఆప్షన్స్‌ను కాన్ఫిగర్ చేసుకోవచ్చు