Best Cars in India: ఒకప్పుడు కారు అంటే కేవలం ప్రయాణ సాధనమే. కానీ ఇప్పుడు అంతకు మించేనని చెప్పొచ్చు. ప్రస్తుతం ప్రతి ఇంట్లో కారు తప్పనిసరి అయిపోయింది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి బయటికి వెళ్లేందుకు కారు అయితే కంఫర్ట్‌గా ఉంటుంది. దీంతో కార్లు కొనేందుకు ఎక్కవమంది ఆసక్తి కనబరుస్తున్నారు. కార్లు అత్యధికంగా అమ్ముడవుతుండటంతో అన్ని కంపెనీలు మార్కెట్‌కు అనుగుణంగా ఎప్పటికప్పుడు సరికొత్త కార్లను లాంచ్ చేస్తున్నాయి. దీంతో కొత్త కారు కొనాలనే ఆలోచనలో ఉన్నవారు ఏది తీసుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తక్కువ బడ్జెట్లో మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్-10 కార్లపై ఓ లుక్కేద్దాం రండి.
మార్కెట్లో తక్కువ బడ్జెట్లో ఉన్న టాప్ కార్లు ఇవే:
1. Tata Punch:
- ఇంజిన్: 1199 సీసీ
- పవర్: 72.41 - 86.63 బీహెచ్పీ
- ట్రాన్స్మిషన్: Manual/Automatic
- గ్లోబల్ NCAP సేఫ్టీ రేటింగ్: 5 స్టార్
- గ్రౌండ్ క్లియరెన్స్: 187 ఎమ్ఎమ్
- టార్క్: 103 ఎన్ఎమ్- 115 ఎన్ఎమ్
- డ్రైవ్ టైప్: FWD
- ధర: రూ. 6 - 10.20 లక్షలు
2. Hyundai Creta:
- ఇంజిన్: 1482 సీసీ - 1497 సీసీ
- పవర్: 113.18 - 157.57 బీహెచ్పీ
- సీటింగ్ కెపాసిటీ: 5
- గ్లోబల్ NCAP సేఫ్టీ రేటింగ్: 4 స్టార్
- గ్రౌండ్ క్లియరెన్స్: 190 ఎమ్ఎమ్
- టార్క్: 143.8 ఎన్ఎమ్ - 253 ఎన్ఎమ్
- డ్రైవ్ టైప్: FWD
- ధర: రూ.11 - 20.5 లక్షలు
3. Maruti Swift:
- ఇంజిన్: 1197 సీసీ
- టార్క్: 111.7 ఎన్ఎమ్
- మైలేజ్: 24.8 - 25.75 కి.మీ/లీటర్
- పవర్: 80.46 బీహెచ్పీ
- ట్రాన్స్మిషన్: Manual/Automatic
- ఫ్యూయెల్: పెట్రోల్
- ధర: రూ. 6.49 - 9.60 లక్షలు
4. Mahindra Thar ROXX:
- ఇంజిన్: 1997 సీసీ, 2184 సీసీ
- టార్క్: 330 ఎన్ఎమ్- 380 ఎన్ఎమ్
- డ్రైవ్ టైప్: RWD
- పవర్: 150- 174 బీహెచ్పీ
- సీటింగ్ కెపాసిటీ: 5
- ఫ్యూయెల్: డీజిల్/ పెట్రోల్
- ధర: రూ.12.99-20.49 లక్షలు
5. Mahindra XUV700:
- ఇంజిన్: 1999 సీసీ - 2198 సీసీ
- టార్క్: 360 ఎన్ఎమ్ - 450 ఎన్ఎమ్
- డ్రైవ్ టైప్: FWD/ AWD
- పవర్: 152 - 197 బీహెచ్పీ
- సీటింగ్ కెపాసిటీ: 5,6,7
- మైలేజ్: 17 కి.మీ/లీటర్
- ధర: రూ. 13.99 - 26. 04 లక్షలు