తెలంగాణ

telangana

ETV Bharat / technology

రూ.10వేల బడ్జెట్లో మంచి​ కెమెరా ఫోన్ కొనాలా? టాప్​-5 ఆప్షన్స్ ఇవే! - Best Camera Phones Under 10000

Best Camera Phones Under 10000 : రేటు తక్కువగా ఉండాలి, ఫీచర్స్ మాత్రం బాగుండాలని స్మార్ట్‌ఫోన్ కొనే చాలామందికి ఉంటుంది. అలాంటి వారు రూ.10వేలలోపు ఫోన్ల కోసం ఇంటర్నెట్‌లో బాగా సెర్చ్ చేస్తుంటారు. వివిధ ఫోన్ల స్పెసిఫికేషన్ల కోసం స్టడీ చేస్తుంటారు. అలాంటి వారి కోసమే 5 బెస్ట్ ఫోన్స్ వివరాలు ఇక్కడ ఇచ్చాం.

Best Phones Under 10000
Best Camera Phones Under 10000 (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 18, 2024, 2:16 PM IST

Best Camera Phones Under 10000 : నేటి రోజుల్లో చొక్కాకు జేబు లేకున్నా ఫర్వాలేదు కానీ, జేబులో స్మార్ట్‌ఫోన్ మాత్రం కచ్చితంగా ఉండాల్సిందే. అందుకే స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు అంత భారీ రేంజులో జరుగుతున్నాయి. ప్రత్యేకించి రూ.10వేలలోపు రేంజులో బెస్ట్ ఫీచర్స్‌తో కూడిన స్మార్ట్ ఫోన్స్ కోసం చాలా మంది వెతుకుతుంటారు. అలాంటి వారికి ఉపయోగపడే సమాచారాన్ని అందించే కథనమిది.

1. Realme Narzo 50i :తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ కోరుకునే వారికి ‘రియల్‌మీ నార్జో 50ఐ’ బెస్ట్ ఫోన్.

  • ధర : రూ.7,499.
  • రంగు : కార్బన్ బ్లాక్
  • ర్యామ్ : 4 జీబీ
  • స్టోరేజీ : 64 జీబీ
  • స్క్రీన్ : 6.5 అంగుళాల HD+ స్క్రీన్‌
  • బ్యాటరీ : 5000 mAh Li-Po బ్యాటరీ
  • ప్రాసెసర్ : 1.6 GHz అక్టా కోర్ SC9863A ప్రాసెసర్‌
  • కెమెరాలు : 8ఎంపీ ఆటో ఫోకస్ సింగిల్ ప్రైమరీ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా
  • బరువు : 195 గ్రాములు
  • వారంటీ : 1 సంవత్సరం

ప్లస్‌లు, మైనస్‌లు

  • ‘రియల్‌మీ నార్జో 50ఐ’ ఫోనులో స్ప్లాష్ ప్రూఫ్ రెసిస్టెన్స్ పూత ఉంది. 400 నిట్స్ బ్రైట్‌నెస్‌‌ను ఇది అందిస్తుంది.
  • ఈ ఫోను ఆండ్రాయిడ్ 11లో రన్ అవుతుంది.
  • రివర్స్ ఛార్జింగ్‌‌కు సపోర్ట్ చేస్తుంది.
  • ఈ ఫోన్​కు గొరిల్లా గ్లాస్ రక్షణ లేదు
  • ప్రత్యేక మైక్రో ఎస్‌డీ కార్డ్ మద్దతుతో స్టోరేజీని విస్తరించుకోవచ్చు.
  • 1080p వీడియో రికార్డింగ్ సపోర్ట్ అందుబాటులో ఉంది.

2. Oppo A15s :తక్కువ రేటులో సాధారణ రోజువారీ ఉపయోగం కోసం, మంచి ఫోన్ కావాలంటే ‘ఒప్పో ఏ15ఎస్‌’ను తీసుకోవడం బెస్ట్.

  • ధర : రూ.9,990
  • రంగు : డైనమిక్ బ్లాక్
  • డిస్‌ప్లే : 16.55 సెంటీమీటర్లు (6.52 అంగుళాలు) HD+ డిస్‌ప్లే
  • ప్రాసెసర్: 2.3 GHz మీడియాటెక్ హీలియో P35 అక్టా కోర్
  • ర్యామ్: 4 జీబీ
  • స్టోరేజీ : 64 జీబీ
  • బ్యాటరీ కెపాసిటీ : 4230 mAH లిథియం పాలిమర్ బ్యాటరీ
  • వెనుక కెమెరా : 13 ఎంపీ ప్రధాన కెమెరా + 2 ఎంపీ డెప్త్ కెమెరా + 2 ఎంపీ మాక్రో లెన్స్ AI ట్రిపుల్ కెమెరా
  • ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ ఏఐ బ్యూటిఫికేషన్ సెల్ఫీ కెమెరా
  • బరువు : 120 గ్రాములు
  • వారంటీ : 1 సంవత్సరం

ప్లస్‌లు, మైనస్‌లు

  • ఒప్పో ఏ15ఎస్ ఫోనులో 480 నిట్స్ బ్రైట్‌నెస్ సెట్టింగ్‌లతో కూడిన 6.52 అంగుళాల భారీ డిస్‌ప్లే ప్యానెల్ వస్తుంది.
  • గొరిల్లా గ్లాస్ రక్షణ లేదు.
  • స్నాపీ ఫింగర్​ప్రింట్ స్కానర్ అందుబాటులో ఉంది. ఫాస్ట్ రియాక్షన్ ఫేస్-ఐడీ ఉంటుంది.
  • భారీ గేమింగ్ యాక్టివిటీ కోసం ఇది పనికి కాదు.
  • వెనుక, ముందు కెమెరాల నుంచి 1080 పిక్సెల్స్ వరకు వీడియోలను రికార్డ్ చేయొచ్చు.
  • ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.
  • తగినంత స్టోరేజీ సామర్థ్యం ఉంటుంది.

3. Xiaomi Redmi 10 Prime : వేగవంతమైన ఛార్జింగ్‌, పెద్ద బ్యాటరీ, అద్భుతమైన డిజైన్‌ కావాలని భావించేవారు ‘షావోమీ రెడ్‌మీ 10 ప్రైమ్’ ఫోన్‌ను కొనాలి.

  • ధర : రూ.10,999
  • డిస్‌ప్లే : 6.5 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ + డాట్ డిస్ప్లే; 90 Hz రిఫ్రెష్ రేట్
  • ప్రాసెసర్: హైపర్ ఇంజిన్ 2.0తో మీడియా టెక్ హీలియో G88 అక్టా కోర్ ప్రాసెసర్; గరిష్టంగా 2.0 GHz క్లాక్ స్పీడ్
  • ర్యామ్: 4 జీబీ
  • స్టోరేజీ : 64 జీబీ
  • బ్యాటరీ కెపాసిటీ : 6000 mAh బ్యాటరీ; 18W ఫాస్ట్ ఛార్జింగ్; 9W వరకు రివర్స్ ఛార్జింగ్; 22.5W వైర్డ్ ఛార్జర్
  • వెనుక కెమెరా : 50 ఎంపీ + 8 ఎంపీ + 2 ఎంపీ + 2 ఎంపీ
  • ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ
  • బరువు : 192 గ్రాములు
  • వారంటీ : 1 సంవత్సరం

ప్లస్‌లు, మైనస్‌లు

  • ‘షావోమీ రెడ్‌మీ 10 ప్రైమ్’ ఫోనులో 6,000 mAh కెపాసిటీతో భారీ బ్యాటరీ ఉంటుంది.
  • ప్లాస్టిక్ బాడీ ఉంటుంది.
  • రిఫ్రెష్ రేట్‌ 90Hz
  • eMMC 5.1 స్టోరేజీకి సపోర్ట్ లభిస్తుంది.
  • లౌడ్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి.
  • ప్రత్యేక మైక్రో- ఎస్‌డీ కార్డ్ స్లాట్ ఉంది.

4. Nokia 2.3 Android 10 :చాలా తక్కువ బడ్జెట్‌ కలిగిన వారు నోకియా 2.3 ఆండ్రాయిడ్ 10 ఫోన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ధర తక్కువే అయినా, దీని డిస్‌ప్లే పెద్దగానే ఉంటుంది.

  • ధర : రూ.7,990
  • డిస్‌ప్లే : 6.2 అంగుళాల HD+ 18:9 ఫుల్ స్క్రీన్ ఇన్ సెల్ డిస్‌ప్లే
  • ప్రాసెసర్: మీడియా టెక్ హీలియో ఏ22 ప్రాసెసర్
  • ర్యామ్: 2 జీబీ
  • స్టోరేజీ : 32 జీబీ
  • బ్యాటరీ కెపాసిటీ : 4000 mAh బ్యాటరీ
  • వెనుక కెమెరా : 13 ఎంపీ + 2 ఎంపీ డ్యూయల్ వెనుక కెమెరా
  • ఫ్రంట్ కెమెరా : 5 ఎంపీ
  • బరువు : 183 గ్రాములు

ప్లస్‌లు, మైనస్‌లు

  • నోకియా 2.3 ఆండ్రాయిడ్ 10 మోడల్ ఫోనులో ప్రకాశవంతమైన, పెద్ద 6.2 అంగుళాల మల్టీ టచ్ డిస్‌ప్లే ప్యానెల్ ఉంటుంది.
  • ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు.
  • రోజువారీ పనుల కోసం లాగ్ ఫ్రీ, మృదువైన పనితీరు కోసం ఈ ఫోన్ ఉపయోగపడుతుంది.
  • గొరిల్లా గ్లాస్ రక్షణ లేదు.
  • సుదీర్ఘ బ్యాటరీ జీవితం
  • వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం లేదు.
  • సొగసైన, తేలికైన బాడీ ఈ ఫోనుకు ఉంటుంది.

5. Realme C11 -2021 :పెద్ద డిస్‌ప్లే, మెరుగైన బ్యాటరీ కావాలని భావించే వారు రియల్‌మీ సీ11 -2021 ఫోనును కొనడం బెస్ట్.

  • ధర : రూ.7,399
  • డిస్‌ప్లే : 16.51 సెం.మీ, 6.5 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే
  • ప్రాసెసర్ : ఆక్టా కోర్ మీడియాటెక్ MT6765G హీలియో G35 (12 nm)
  • ర్యామ్ : 2 జీబీ
  • స్టోరేజీ : 32 జీబీ
  • బ్యాటరీ కెపాసిటీ : 5000 mAh
  • వెనుక కెమెరా : 13 ఎంపీ + 2 ఎంపీ
  • ఫ్రంట్ కెమెరా : 5 ఎంపీ
  • బరువు : 190 గ్రాములు
  • వారంటీ : 1 సంవత్సరం

ప్లస్‌లు, మైనస్‌లు

  • రియల్‌మీ సీ11 -2021 ఫోన్‌ తేలికైన, స్ప్లాష్ రెసిస్టెన్స్ డిజైన్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది.
  • గొరిల్లా గ్లాస్ రక్షణ లేదు.
  • ఆకట్టుకునే 400 nits IPS LCD డిస్​ప్లే ఈ ఫోనులో ఉంది.
  • కెమెరా పనితీరు యావరేజ్‌గా ఉంటుంది.
  • ప్రత్యేక మైక్రో ఎస్‌డీ కార్డ్‌కు ఈ ఫోను సపోర్ట్ చేస్తుంది.
  • ఫింగర్ ప్రింట్ స్కానర్ లేదు.
  • బ్యాటరీ లైఫ్ చాలా ఎక్కువ.

మీ ఫోన్​ పోయిందా? డోంట్ వర్రీ - స్విఛ్ ఆఫ్​లో ఉన్నా ఈజీగా కనిపెట్టేయండిలా! - Missing Mobile Tracking

మీ యూట్యూబ్​ ఛానల్​ సూపర్​ సక్సెస్​ కావాలా? ఈ టాప్​-6 టిప్స్​ మీ కోసమే! - YouTube Tips To Grow Your Channel

ABOUT THE AUTHOR

...view details