Best AI Tools For Infographics :పేజీల కొద్దీ సమాచారాన్నైనా, వార్తనైనా ఒక్క ఇన్ఫోగ్రాఫిక్లో చూపించవచ్చు. అలాగే పెద్ద పెద్ద ప్రాజెక్ట్‌ల వివరాలను సైతం ఇన్ఫోగ్రాఫిక్స్‌లో చూపిస్తే ఆకర్షణీయంగా ఉంటుంది. సులభంగా అర్థమవుతుంది. వాణిజ్య ప్రకటనలు, బ్యానర్స్ ఇలా దేన్నైనా ఇన్ఫోగ్రాఫిక్స్ చేయిపిస్తే చూడముచ్చటగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆకర్షణీయమైన ఇన్ఫోగ్రాఫిక్స్ ను క్రియేట్ చేయడానికి ఉపయోగపడే బెస్ట్ 8 ఏఐ టూల్స్ ఇవే.
1. Canva
కాన్వా అనేది ఒక పాపులర్ ఏఐ పవర్డ్ గ్రాఫిక్ డిజైన్ టూల్. ఇది మంచి విజువల్ కటెంట్‌ను క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాన్వాలో మంచి డిజైన్ టూల్స్, ఫీచర్లు ఉంటాయి. అలాగే కాన్వా ప్రత్యేకంగా ఇన్ఫోగ్రాఫిక్స్ కోసం రూపొందించిన టెంప్లేట్ల లైబ్రరీని అందిస్తుంది. సోషల్ మీడియా గ్రాఫిక్స్, ప్రెజెంటేషన్స్, పోస్టర్స్ వంటి వాటిని కాన్వా ఉపయోగించి డిజైన్ చేయవచ్చు.
2. Piktochart
పిక్టోచార్ట్ మరో అద్భుతమైన ఏఐ ఇన్ఫోగ్రాఫిక్ మేకర్. ఇది వినియోగదారులకు వివిధ రకాల ఇన్ఫోగ్రాఫిక్స్ సృష్టించే సామర్థ్యాన్ని అందిస్తుంది. స్టాండర్డ్ ఇన్ఫోగ్రాఫిక్, ప్రెజెంటేషన్, పోస్టర్, రిపోర్ట్స్‌ను క్రియేట్ చేయాలంటే పిక్టోచార్ట్ ఉపయోగపడుతుంది. ఇది యూజర్ ఫ్రైండ్లీ ఇంటర్ ఫేస్‌ను కలిగి ఉంటుంది.
3. Venngage
కాన్వా మాదిరిగానే వెంగేజ్తో కూడా ఇన్ఫోగ్రాఫిక్స్‌తో సహా వివిధ రకాల డిజైన్లను రూపొందించొచ్చు. పోస్టర్స్, ప్రమోషన్ పోస్టర్స్ వంటి ఇన్ఫోగ్రాఫిక్స్ కోసం ఈ టూల్ టెంప్లేట్లను అందిస్తుంది. వెంగేజ్లో మంచి ఇమేజ్ గ్యాలరీ ఉంటుంది.
4.Visme
విస్మే అనేది విక్రయదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన బహుముఖ ఏఐ బేస్డ్ డిజైన్ టూల్. ఇది ప్రెజెంటేషన్స్, యానిమేషన్స్, మాక్ అప్స్, బ్యానర్స్, ఇన్ఫోగ్రాఫిక్స్ క్రియేట్ చేస్తుంది. ఇందులో కూడా యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ ఫేస్ ఉంటుంది. విస్మేను ఇన్ఫోగ్రాఫిక్ క్రియేటర్స్ ఎక్కువగా వాడుతుంటారు.