ATMOS 2024:తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో నేటి నుంచి టెక్నాలజీ మేళా జరగనుంది. ఈ కార్యక్రమంలో వేలాది మంది విద్యార్థులు తమ ప్రతిభను చాటనున్నారు. హైదరాబాద్‌లోని బిట్స్ పిలానీ క్యాంపస్ ఈ టెక్నాలజీ ఫెయిర్ 'ATMOS 2024'కి వేదిక కానుంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో రోబోట్ వార్స్, డ్రోన్ రేసింగ్, హ్యాకథాన్ వంటి పోటీలు నిర్వహించనున్నారు. అంతే కాకుండా టెక్ ఎక్స్‌పో, ఇన్నోవేషన్స్, రేసింగ్, క్విజ్ పోటీలు కూడా ఈ ఈవెంట్లో ఉంటాయి.
ఈ ఏడాది స్పెషల్ ఇదే!:వివిధ కార్యకలాపాలతో ఏటా జరిగే ఈ ATMOS ఈవెంట్ అధిక సంఖ్యలో యువతను ఆకర్షిస్తుంది. ఈ ఏడాది టెక్నాలజీ ఫెస్టివల్లో స్పెషల్‌గా రోబో వార్స్ నిర్వహించనున్నారు. దేశంలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు తయారు చేసిన 20కి పైగా రోబోలు ఈ పోటీలో పాల్గొంటాయి. ఈ ఈవెంట్లో డ్రోన్ రేసింగ్ కూడా ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
ఈ కార్యక్రమంలో ప్రొఫెషనల్ ఎఫ్‌పివి డ్రైవర్లు కూడా పాల్గొంటారు. ATV రేసింగ్‌లో విద్యార్థులు ఆటో ఎక్స్‌పో అండ్ టైమ్ అటాక్ కాంపిటీషన్‌లో భాగంగా వారు నిర్మించిన వాహనాలను నడుపుతారు. దేశవ్యాప్తంగా పది ఏటీవీ టీమ్‌లు పోటీపడనున్నాయి. విద్యార్థుల కోడింగ్ నైపుణ్యాలను ప్రదర్శించే హ్యాకథాన్ కూడా ఉంటుంది.