Apple AI Beta Version Preview Released: టెక్ దిగ్గజం యాపిల్ తన ఏఐ సాఫ్ట్‌వేర్ బీటా వెర్షన్ ప్రివ్యూని గురువారం రిలీజ్ చేసింది. ఇందులో ChatGPT, ఇమేజ్-జనరేషన్ ఫీచర్లు ఉన్నాయి. యాపిల్ విడుదల చేసిన ఈ ప్రివ్యూలో ఎక్కువగా చాట్‌జిపిటి ఇంటిగ్రేషన్‌పై చర్చించింది. iOS 18.1లో భాగంగా వచ్చే వారం ప్రారంభంలో Apple Intelligence ఫీచర్‌ల మొదటి వేవ్‌ను కంపెనీ విడుదల చేయనుంది.
ఈ ఏడాది ప్రారంభంలో వార్షిక డెవలపర్ సమావేశంలో కంపెనీ తన యాపిల్ ఇంటెలిజెన్స్‌ను పరిచయం చేసింది. ఇందులో Genmoji, ఇమేజ్ ప్లేగ్రౌండ్, కెమెరా కంట్రోల్‌తో విజువల్ ఇంటెలిజెన్స్, OpenAI ChatGPT వంటి ఫీచర్లు ఉన్నాయి. Genmoji, ఇమేజ్ ప్లేగ్రౌండ్ యూజర్స్ మెసెజెస్ పంపించేందుకు డివైజ్‌లో ఇమేజెస్‌ను రూపొందించేందుకు ఉపయోగపడతాయి.
కంపెనీ విడుదల చేసిన సమాచారం ప్రకారం.. యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ చాట్‌జీపీటీతో కనెక్ట్ అయి ఉంటుంది. యూజర్స్ సిరిని ఏదైనా సంక్లిష్టమైన ప్రశ్న అడిగితే ఇది "Use ChatGPT?" అనే ఆప్షన్‌ను ఇస్తుంది. అప్పుడు మీకు కావాలంటే ఆ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవచ్చు. లేకుంటే తిరస్కరించొచ్చు. ఒకవేళ మీరు చాట్‌జీపీటీని సెలక్ట్ చేసుకుంటే Gen- AI సర్వీస్ ద్వారా ప్రాసెస్ చేస్తుంది. అనంతరం దీని రెస్పాన్స్ మీకు మొబైల్ డిస్ప్లేపై కన్పిస్తుంది.