తెలంగాణ

telangana

ETV Bharat / technology

సెల్ఫ్ రిపేర్ ప్రోగ్రాంను విస్తరించిన యాపిల్- ఐఫోన్ 16 సిరీస్ యాక్ససరీస్ ధరల వివరాలివే! - APPLE SELF REPAIR PROGRAMME

యాపిల్ తన తాజా స్మార్ట్‌ఫోన్‌లు ఐఫోన్ 16, 16 ప్రో సిరీస్‌ల కోసం సెల్ఫ్ రిపేర్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది.

Apple Released Price Details of iPhone 16 Series Accessories
Apple Released Price Details of iPhone 16 Series Accessories (IANS)

By ETV Bharat Tech Team

Published : Nov 11, 2024, 5:08 PM IST

Apple Self Repair Programme:యాపిల్ తన సెల్ఫ్ రిపేర్ ప్రోగ్రామ్​ను లేటెస్ట్ స్మార్ట్​ఫోన్స్ ఐఫోన్ 16, 16 ప్రో సిరీస్​లకు విస్తరించింది. ఇప్పటికే కంపెనీ రిపేర్ గైడ్​లైన్స్ ప్రకారం విడిభాగాల లిస్ట్ సెల్ఫ్ సర్వీస్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ విడిభాగాలు ప్రస్తుతం అమెరికా, యూరప్‌లోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయని కంపెనీ తెలిపింది.

యాపిల్ మొత్తం నాలుగు ఐఫోన్ 16 (రివ్యూ) మోడల్స్ యాక్ససరీస్​ గురించి సమాచారాన్ని ఇచ్చింది. డిస్​ప్లే, బ్యాక్ ప్యానెల్, కెమెరా, బ్యాటరీతో పాటు ఇతర యాక్ససరీస్​తో సహా మరమ్మతుల కోసం రీప్లేస్‌మెంట్ యూనిట్‌లను అందిస్తుంది. మోడల్‌ను బట్టి ఈ యాక్ససరీస్ ధర మారుతుంది. ఉదాహరణకు ఐఫోన్ 16/16 ప్లస్ కెమెరా మాడ్యూల్ ధర 169 డాలర్లు. కానీ ఐఫోన్ 16 ప్రో/ప్రో మ్యాక్స్ కెమెరా మాడ్యూల్ ధర 249 డాలర్లు. అదే డిస్​ప్లే, బ్యాటరీ, బ్యాక్ ప్యానెల్‌కూ వర్తిస్తుంది. అంటే ప్రో మోడల్స్​ వినియోగదారులు వనిల్లా ఐఫోన్ 16 యూజర్ల కంటే కొంచెం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ పేర్కొంది.

ఐఫోన్ 16/16 ప్లస్​ బ్యాటరీ ధర $99. ఇది ఐఫోన్ 15 బ్యాటరీ కంటే కొంచెం ఖరీదైనది. కానీ ఐఫోన్ 16 ప్రో (రివ్యూ) సిరీస్ బ్యాటరీల ధర 116 డాలర్లు. అదేవిధంగా ఐఫోన్ 16 సిరీస్‌లోని 60Hz డిస్‌ప్లే ప్యానెల్‌ల ధర $279 కాగా, ఐఫోన్ 16 ప్రో సిరీస్ స్క్రీన్ ధర $379 అని కంపెనీ తెలిపింది. ఈ ధరలను పరిగణనలోకి తీసుకుంటే ఐఫోన్సెల్ఫ్-రిపేరింగ్ అనేది చాలా ఖరీదుతో కూడుకున్నది. వినియోగదారులు Apple Care+లో వీటిని కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ కొనుగోలు చేయడం వల్ల వీటి రిపేరింగ్ ఖర్చు కాస్త తగ్గుతుంది.

ఐఫోన్ 16 డిజైన్‌లో యాపిల్ పలు మార్పులు చేసింది. ఇది దాని ప్రీవియస్ మోడల్స్​ కంటే కొంచెం ఎక్కువ రిపేర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇది కొత్త బ్యాటరీ రిమూవల్ ప్రాసెస్​ను కలిగి ఉంటుంది. ఇది 9W బ్యాటరీని మాత్రమే డిశ్చార్జ్​ చేస్తుంది. దీని స్లాట్, వెనుక ప్యానెల్ సులభంగా రిపేర్ చేయొచ్చు. అంతేకాకుండా కంపెనీ iOS 18 అప్​డేట్​తో పాటు రిపేర్ అసిస్టెంట్‌ను కూడా రిలీజ్ చేసింది. ఇది విడిభాగాలను సమీకరించడం, కాన్ఫిగర్ చేయడం చాలా సులభం చేస్తుంది. ఇది చాలా సింపుల్ ప్రాసెస్​లా అనిపిస్తుంది. అయితే సులభంగా యాక్సెస్ చేయగల గైడ్స్, యూనిట్స్ ఉన్నప్పటికీ ఐఫోన్​ రిపేర్ చేయడం ప్రాసెస్ అంత ఈజీ కాదు. ఇందులో ఏ చిన్న పొరపాటు జరిగినా ఐఫోన్ పనిచేయకుండా పోవచ్చు.

స్టైలిష్ లుక్​లో మారుతి డిజైర్- ప్రీమియం ఫీచర్లతో బడ్జెట్ ధరలోనే లాంచ్!

ఓయమ్మా రోబో గీసిన బొమ్మకు డిమాండ్ మాములుగా లేదుగా- ఏకంగా రూ.9 కోట్లకు పైగా..!

ABOUT THE AUTHOR

...view details