తెలంగాణ

telangana

ETV Bharat / technology

ఫోన్ నుంచే PC ఫైల్స్​ యాక్సెస్ - మైక్రోసాఫ్ట్ నయా ఫీచర్​ - ఎలా వాడాలో తెలుసా? - Microsoft Windows Latest Features - MICROSOFT WINDOWS LATEST FEATURES

Microsoft Windows Latest Features : మైక్రోసాఫ్ట్ విండోస్ యూజర్లకు గుడ్ న్యూస్​. మైక్రోసాఫ్ కంపెనీ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఓ సరికొత్త ఫీచర్​ను టెస్ట్ చేస్తోంది. ఇదే కనుక అందుబాటులోకి వస్తే, మీ కంప్యూటర్​​లోని ఫైల్స్​ను నేరుగా మీ ఆండ్రాయిడ్​ ఫోన్​ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. అంటే మీ కంప్యూటర్​లోని ఫైల్స్​ను ఆండ్రాయిడ్ ఫోన్​ ద్వారా కాపీ, రీనేమ్​, షేర్​, డిలీట్​ లాంటివన్నీ చేయవచ్చు.

Access Android files on Windows
Android-Windows compatibility (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 30, 2024, 1:15 PM IST

Microsoft Windows Latest Features : మైక్రోసాఫ్​ ఓ సరికొత్త ఫీచర్​ను టెస్ట్ చేస్తోంది. ఈ ఫీచర్​ అందుబాటులోకి వస్తే, విండోస్​ 11 ఫైల్ ఎక్స్​ప్లోరర్ ద్వారా నేరుగా మీ కంప్యూటర్​లోని ఫైల్స్​ను, మీ ఆండ్రాయిడ్ ఫోన్​తో యాక్సెస్ చేయడానికి వీలవుతుంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్​ కొంత మంది టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదే కనుక అందుబాటులోకి వస్తే, వైర్​లెస్​గా మీ కంప్యూటర్​లోని ఫైల్స్​ను, ఫోల్డర్స్​ను, మీ ఆండ్రాయిడ్​ ఫోన్ ద్వారా నేరుగా యాక్సెస్ చేయడానికి వీలు ఏర్పడుతుంది.

ఇది ఎలా పని చేస్తుంది?
మీ ఆండ్రాయిడ్ ఫోన్​ను విండోస్ 11 ఫైల్ ఎక్స్​ప్లోరర్​తో అనుసంధానం (ఇంటిగ్రేట్)​ చేయాలి. అంతే సింపుల్​! ఇక అప్పటి నుంచి మీ కంప్యూటర్​లోని ఫైల్స్​ను, మీ ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారానే కాపీ, షేర్​, డిలీట్ లాంటివన్నీ చేయవచ్చు. అంతేకాదు ఈ ఫైల్స్​ను మీ సిస్టమ్ నుంచి నేరుగా ఫోన్​లోకి ట్రాన్స్​ఫర్ చేసుకోవచ్చు. సాధారణ ఫోన్​ లింక్ యాప్స్​తో పోలిస్తే, ఈ ప్రక్రియ చాలా వేగంగా జరిగిపోతుంది.

ఈ నయా ఫీచర్ వాడడం ఎలా?
ప్రస్తుతానికి ఈ ఫీచర్ కొంత మందికి మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఇలాంటి వారు దీనిని ఎలా ఎనేబుల్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

మైక్రోసాఫ్ట్ విండోస్​లో తెచ్చిన ఈ నయా ఫీచర్ వాడాలంటే, మీ దగ్గర ఆండ్రాయిడ్​ 11 లేదా దానికంటే అడ్వాన్స్​డ్ వెర్షన్​ ఫోన్ ఉండాలి. ఇలాంటి ఫోన్​ మీ దగ్గర ఉంటే, ఈ కింది ప్రాసెస్​ను ఫాలో అవ్వండి.

  • ముందుగా మీ కంప్యూటర్​లోని Settings ఓపెన్ చేయాలి.
  • 'బ్లూటూత్​ అండ్ డివైసెస్​'ను సెలక్ట్ చేయాలి.
  • 'మొబైల్ డివైజ్​'పై క్లిక్ చేయాలి.
  • 'మేనేజ్ డివైజ్'​ను సెలక్ట్ చేసుకోవాలి.
  • మీ పీసీ, ఆండ్రాయిడ్​ ఫోన్​తో కనెక్ట్ కావడానికి కావాల్సిన పర్మిషన్లు అన్నీ ఇవ్వాలి.
  • ఫైల్​ ఎక్స్​ప్లోరర్​కు యాక్స్​ ఇస్తూ టోగుల్ చేయాలి.
  • నోటిఫికేషన్స్​, కెమెరా యాక్సెస్​ కోసం కూడా పర్మిషన్స్​ ఇవ్వాలి. అంతే సింపుల్​!

వీరికి బాగా ఉపయోగపడుతుంది!
రోజువారీ పని కోసం పీసీ, ఆండ్రాయిడ్​ ఫోన్స్ ఉపయోగించే వారికి ఈ నయా ఫీచర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇంటి వద్ద కంప్యూటర్ ఉన్నప్పుడు, దూరంగా ఉన్న మీరు, ఎలాంటి ఇబ్బంది లేకుండా, మీ ఫోన్ ద్వారానే కంప్యూటర్​లోని ఫైల్స్​ను చూడడానికి వీలు అవుతుంది. అంతేకాదు వీటిని షేర్ చేయడానికి, డౌన్​లోడ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది.

ఇకపై వాట్సాప్‌లోనూ యూజర్ నేమ్ క్రియేషన్‌- నంబర్‌ లేకున్నా చాట్ చేసేయొచ్చు! - Whatsapp New Feature

వీడియో కాల్​ లైవ్​లోనే ఫిల్టర్స్, మేకప్​​ టచ్! నయా వాట్సాప్ ఫీచర్​తో మనుషుల్ని గుర్తుపట్టడం కష్టమే! - WhatsApp Video Calls New Features

ABOUT THE AUTHOR

...view details