Android 15 Update For Samsung:ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఆండ్రాయిడ్ 15 అప్‌డేట్ రానే వచ్చింది. అయితే ప్రస్తుతం Google Pixel కస్టమర్‌లకు మాత్రమే ఈ అప్‌డేట్ అందుబాటులోకి వచ్చింది. గూగుల్ పిక్సెల్ ఫోన్‌లతో పాటు శాంసంగ్ గెలాక్సీ ఎస్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు కూడా బాగానే ప్రాచుర్యం పొందాయి.
ఈ నేపథ్యంలో శాంసంగ్ కొత్త S25 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ 15 ఆధారిత UI 7 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రావొచ్చని అంతా భావిస్తున్నారు. 2024 సంవత్సరం ముగియడానికి కేవలం మరో రెండు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ ఏడాది ముగిసేలోగా శాంసంగ్ తన స్మార్ట్‌ఫోన్ రిలీజ్‌తో పాటు కొత్త One UI 7 అప్‌డేట్‌ను కూడా తీసుకురావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో శాంసంగ్ రీసెర్చ్ సెంటర్ (SammyFans) కొంత సమాచారాన్ని వెల్లడించింది. శాంసంగ్ గెలాక్సీ యూజర్స్ కోసం త్వరలో ఎక్సైటింగ్ న్యూస్ రానుందని తెలిపింది. ఆండ్రాయిడ్ 15 బేస్డ్ కొత్త One UI 7.0 ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్ ఎక్కువ దూరంలో లేదని, అనుకున్నదానికంటే త్వరగానే ఈ అప్‌డేట్ వస్తుందని పేర్కొంది. అక్టోబర్ 2024 చివరి నాటికి One UI 7.0 వెర్షన్ అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది.
ఆండ్రాయిడ్ 15 బేస్డ్ One UI 7.0 అప్డేట్తో పనిచేయనున్న శాంసంగ్ గెలాక్సీ మొబైల్స్ ఇవే!:
Galaxy S సిరీస్:
- Galaxy S24 అల్ట్రా
- Galaxy S24+
- Galaxy S24
- Galaxy S23 అల్ట్రా
- Galaxy S23+
- Galaxy S23
- Galaxy S23 FE
- Galaxy S22 అల్ట్రా
- Galaxy S22+
- Galaxy S22
- Galaxy S21 FE
- Galaxy S21 అల్ట్రా
- Galaxy S21+
- Galaxy S21
Galaxy Z సిరీస్:
- Galaxy Z ఫోల్డ్ 6 (Galaxy Z Fold 6)
- Galaxy Z ఫోల్డ్ 5
- Galaxy Z ఫ్లిప్ 6
- Galaxy Z ఫ్లిప్ 5
- Galaxy Z ఫోల్డ్ 4
- Galaxy Z ఫ్లిప్ 4
- Galaxy Z ఫోల్డ్ 3
- Galaxy Z ఫ్లిప్ 4