తెలంగాణ

telangana

ETV Bharat / technology

యూట్యూబ్ క్రియేటర్ల కోసం బెస్ట్ AI టూల్స్! అంతా ఫ్రీనే! ఏమేం చేయొచ్చో తెలుసా?

AI Tools For Youtube Video Creation : మీరు యూట్యూబ్ క్రియేటరా? బెస్ట్​ కంటెంట్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నారా? స్క్రిప్ట్ రైటింగ్ నుంచి వాయిస్ ఓవర్, వీడియో ఎడిటింగ్, సబ్​టైటిల్స్ యాడ్ చేయడం వరకు అన్నీ చేసి పెట్టే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టూల్స్ కోసం చూస్తున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఈ స్టోరీ మీకోసమే.

ai tools for youtube video creation
ai tools for youtube video creation

By ETV Bharat Telugu Team

Published : Jan 27, 2024, 4:01 PM IST

AI Tools For Youtube Video Creation :యూట్యూబ్ వంటి మాధ్యమాల్లో రాణించాలంటే గొప్ప కంటెంట్​ను క్రియేట్ చేయించాల్సిందే. స్క్రిప్ట్ రాయడం, వీడియో ఎడిటింగ్ చేయడం, థంబ్​నెయిల్స్ రూపొందించడం, హెడ్డింగ్స్- ఇలా ప్రతి అంశంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి పనులు చేయడానికి ఏఐ వచ్చేసింది. ఏం కావాలన్నా చకచకా చేసి పెట్టేస్తోంది. ఈ టూల్స్ వాడటం వల్ల క్వాలిటీ పెరగడమే కాకుండా వేగంగా కంటెంట్ ప్రొడ్యూస్ చేయవచ్చు. అయితే, ఇవేవో డబ్బులు చెల్లించి ఉపయోగించుకునే టూల్స్ కావు. అన్నీ ఉచితంగా అందుబాటులో ఉన్నవే! మరి యూట్యూబ్ కంటెంట్ తయారు చేసే వారి కోసం ఉపయోగపడే 6 బెస్ట్ ఏఐ టూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దామా?

GravityWrite :
AI Tools For Content Writing :హైక్వాలిటీ, యూనీక్ కంటెంట్ క్రియేట్ చేయడానికి ఈ టూల్ బాగా ఉపయోగపడుతుంది. ఉచితంగా థంబ్​నెయిల్ ఐడియాలు కూడా ఇస్తుంది. ఎలాంటి స్క్రిప్ట్ అడిగినా రాసి ఇచ్చేస్తుంది. కంటెంట్​కు మంచి టైటిల్స్ కూడా పెడుతుంది. gravitywrite(డాట్ కామ్) వెబ్​సైట్​లోకి వెళ్లి ఉచితంగా అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మీరు ఎంచక్కా కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన కంటెంట్​కు సంబంధించి చిన్న కమాండ్ ఇస్తే సరిపోతుంది. కంటెంట్ మొత్తం క్షణాల్లో మీ ముందు ఉంటుంది. దీన్ని ఉపయోగించుకొని డిస్క్రిప్షన్స్, ట్యాగ్స్, హ్యాష్​ట్యాగ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు.

Lumen5 :
టెక్స్ట్​ను వీడియో రూపంలోకి మార్చుకోవడానికి ఈ టూల్ వాడుకోవచ్చు. బ్లాగ్ కోసం రాసుకున్న కంటెంట్​ను యూట్యూబ్ వీడియోగా అప్​లోడ్ చేసుకోవాలని అనుకుంటే ఇది బెస్ట్ టూల్. Lumen5(డాట్ కామ్) వెబ్​సైట్​లోకి వెళ్లి ఫ్రీ సైనప్ పూర్తి చేస్తే మీకు కొన్ని టెంప్లేట్స్ కనిపిస్తాయి. అందులో నచ్చిన దానిని సెలెక్ట్ చేసుకొని 'ట్రాన్స్​ఫార్మ్ టెక్స్ట్ ఇంటు వీడియో' అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి. అక్కడ కనిపించే బాక్స్​లో టెక్స్ట్ ఇచ్చి 'convert to video'పై క్లిక్ చేయాలి. మనం ఇచ్చిన స్క్రిప్ట్​కు అనుగుణంగా వీడియోను క్రియేట్ చేస్తుంది లూమెన్. అవసరమైతే ఫ్రేమ్​లను కస్టమైజ్ చేసుకునే వీలు కూడా ఉంటుంది. ఈ వీడియోలను ఏ సోషల్ మీడియాలోనైనా పోస్ట్ చేసుకోవచ్చు. అన్ని కమర్షియల్ హక్కులు క్రియేటర్లకు ఉంటాయి.

vidyo.ai :
లాంగ్ వీడియోలను చిన్న చిన్న షార్ట్స్/రీల్స్​గా కట్ చేసుకోవాలని అనుకుంటే 'వీడియో డాట్ ఏఐ'ని ట్రై చేయొచ్చు. సెకన్లలోనే పెద్ద వీడియోలు రీల్స్​లా మారిపోతాయి. ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మన లాంగ్ వీడియోను అప్​లోడ్ చేయాలి. దాన్ని మనం కావాల్సిన ఫార్మాట్​లో కట్ చేసుకోవచ్చు.

  • వివిధ స్టైల్స్​లో వీడియోకు క్యాప్షన్స్ యాడ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది.
  • లాంగ్ వీడియోకు సంబంధించిన చిన్న కట్స్ అన్నీ డ్యాష్​బోర్డ్​లో కనిపిస్తాయి.
  • వీడియో వాయిస్ సైతం మార్చుకోవచ్చు. సెలబ్రిటీల వాయిస్​లు సైతం ఇందులో అందుబాటులో ఉన్నాయి.
  • ఎడిట్ చేసుకున్న వీడియోలను ఫ్రీగా డౌన్​లోడ్ చేసుకోవచ్చు.

డబ్​వర్స్.ఏఐ
ఒకే వీడియోను వేర్వేరు భాషల్లో ప్రొడ్యూస్ చేయడానికి వీలు కల్పించే ఏఐ టూల్ ఇది. డబ్​వర్స్ ద్వారా వీడియోకు సబ్​టైటిల్స్ యాడ్ చేసుకోవడమే కాకుండా, ఇతర భాషల్లో రియలిస్టిక్​ వాయిస్ ఓవర్​ను క్రియేట్ చేసుకోవచ్చు.

  • డబ్​వర్స్.ఏఐ వెబ్​సైట్​లోకి వెళ్లి ఫ్రీగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి.
  • 'డబ్ ఎ వీడియో' ఆప్షన్​పై క్లిక్ చేయాలి. ఏ వీడియోకు అయితే 'సబ్​టైటిల్/వాయిస్ఓవర్' కావాలో దాన్ని అప్​లోడ్ చేయాలి.
  • తర్వాత భాషను, వాయిస్ ఓవర్ నమూనాను ఎంచుకోవాలి. సెకన్లలోనే డబ్బింగ్ వీడియో క్రియేట్ అయిపోతుంది. దీన్ని ఉచితంగా డౌన్​లోడ్ చేసుకోవచ్చు.

అడోబీ పాడ్​కాస్ట్​
వీడియోలకు బ్యాక్​గ్రౌండ్ నాయిస్ ఉంటే అది మంచి యూట్యూబ్​ వీడియో అనిపించుకోదు. ఆ నాయిస్​ను తేలికగా తీసేయవచ్చు. అడోబీ పాడ్​కాస్ట్​ ద్వారా వీడియోకు ప్రొఫెషనల్ సౌండ్ తీసుకురావొచ్చు. స్టూడియోలో రికార్డ్ చేసే ఆడియో ఎంత క్వాలిటీతో ఉంటుందో అదే స్థాయిలో ఎడిట్ చేయగలగడం దీని ప్రత్యేకత.

  • పాడ్​కాస్ట్.అడోబీ.కామ్ వెబ్​సైట్​లోకి వెళ్లాలి.
  • ఆడియో ఫైల్​ను అప్లోడ్ చేయాలి. వెంటనే నాయిస్ క్యాన్సిల్ అయిన ఆడియో స్క్రీన్​పై కనిపిస్తుంది. దాన్ని ఉచితంగా డౌన్​లోడ్ చేసుకోవచ్చు.
  • గంట వ్యవధి ఉన్న ఆడియోను సైతం అప్​లోడ్ చేసుకొని నాయిస్ క్యాన్సిల్ చేసుకోవచ్చు.

wisecut :
AI Tools For Video Editing :వీడియో ఎడిటింగ్ అంటే ఎంత కష్టమైన పనో చెప్పనక్కర్లేదు. వీడియోలో గ్యాప్ లేకుండా చూసుకోవాలి. పాజ్​లు ఎక్కువగా రాకుండా చూడాలి. ఇందుకోసం ఎంతో సమయం వెచ్చించాల్సి వస్తుంది. కానీ, wisecutతో ఈ ప్రక్రియ అంతా సింపుల్​గా అయిపోతుంది. సాధారణ ఎడిటింగ్ టైమ్​తో పోలిస్తే వేగంగా వీడియోలను క్రియేట్ చేసుకోవడం దీని ద్వారా సాధ్యమవుతుంది.

  • wisecut.video వెబ్​సైట్​లోకి వెళ్లి ఫ్రీగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి.
  • కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని, మీడియా ఫైల్స్ యాడ్ చేసుకోవాలి.
  • వెంటనే ఇది ప్రాజెక్ట్ ఎడిట్ చేయడం ప్రారంభిస్తుంది.
  • పాజ్​లను తొలగించి, సబ్​టైటిల్స్, మ్యూజిక్ యాడ్ చేసి వీడియోను సిద్ధం చేస్తుంది.
  • ప్రివ్యూ చూసుకున్న తర్వాత వీడియోలో మార్పులు ఉంటే చేసుకోవచ్చు. ఎడిటింగ్ పూర్తైతే ఫ్రీగా దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Content Creators Gadgets : ఈ 10 వస్తువులు ఉంటే సూపర్ కంటెంట్ మీదే!

మీకు ఈ AI టూల్స్ తెలుసా..? పనులన్నీ క్షణాల్లో పూర్తవుతాయి..!

గూగుల్​ బార్డ్​లో అదిరిపోయే ఫీచర్స్​.. ఎలా వాడాలో తెలుసా?

యూట్యూబ్​ స్టూడియో పెట్టాలా?.. బడ్జెట్లో బెస్ట్ (ఎక్విప్​మెంట్​​) ఆప్షన్స్ ఇవే!

యూట్యూబర్లకు గుడ్​ న్యూస్​.. నయా ఫ్యాన్​ ఫండింగ్​ రూల్స్​తో.. రెవెన్యూ జంప్ షురూ​!

ABOUT THE AUTHOR

...view details