Software Engineers Need AI Skills:ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రెండ్ నడుస్తోంది. ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతూ అన్ని రంగాలకూ వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏఐకి అవసరమైన స్కిల్స్ నేర్చుకోకుంటే 80% సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలున్నాయని గార్ట్‌నర్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
గార్డ్నర్ విశ్లేషకుల ప్రకారం.. ప్రస్తుతం ప్రపంచం ఏఐ వెంట పరుగులు పెడుతున్న దృష్ట్యా తమ ఉద్యోగాలను కాపాడుకునేందుకు 80శాతం మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు నేచురల్-లాంగ్వేజ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, రిట్రీవల్-ఆగ్మెంటెడ్ జనరేషన్ (RAG) వంటి కొత్త ఏఐ స్కిల్స్‌ను నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.
ఇటీవల ప్రచురించిన నోట్లో గ్లోబల్ రీసెర్చ్ సంస్థ.. ఇంజనీర్ల పోస్టులను ఏఐ భర్తీ చేయదని, అయితే వారికి కొత్త రోల్స్‌ను అందించబోతోందని తెలిపింది. "ఏఐ సామర్థ్యంపై బోల్డ్ వాదనలు.. హ్యూమన్ ఇంజనీర్ల డిమాండ్‌ను ఏఐ తగ్గించగలదని లేదా వారి స్థానాన్ని పూర్తిగా భర్తీ చేయగలదనే ఊహాగానాలకు దారితీసింది. భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల పాత్రను ఏఐ పూర్తిగా మార్చేస్తుంది. అయితే సంక్లిష్టమైన, వినూత్నమైన సాఫ్ట్‌వేర్‌ను అందించేందుకు హ్యూమన్ ఎక్సర్సైజ్, క్రియేటివిటీ అవసరం ఎంతైనా ఉంది." - ఫిలిప్ వాల్ష్, గార్ట్‌నర్‌లోని సీనియర్ ప్రిన్సిపల్ అనలిస్ట్
ఈ నేపథ్యంలో US- బేస్డ్ IT రీసెర్చ్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ.. సాఫ్ట్‌వేర్ అభివృద్ధిపైఏఐ ప్రభావం కింది మూడు దశల్లో ఉంటుందని తెలిపింది. అవేంటంటే?
- 1. ఏఐ టూల్స్ స్వల్పకాలిక పరిమితుల్లో పనిచేస్తాయి. అంటే ఇది ఇప్పటికే ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల వర్క్ఫ్లోస్ను పెంచుకోవడం ద్వారా ప్రొడక్టివిటీని మెరుగుపరుస్తుంది.
- 2. AI ఏజెంట్స్.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు నిర్వహించే పనులను పూర్తిగా ఆటోమేట్ చేయడం ద్వారా బౌండరీస్‌ను ముందుకు తీసుకురాగరు. ఆ సమయంలో చాలా వరకు కోడింగ్‌ను హ్యూమన్- ఆథర్డ్ కాకుండా ఏఐ- జనరేట్ చేస్తుంది.
- 3. రానున్న రోజుల్లో AI ఇంజనీరింగ్ మరింత సమర్థవంతంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఆర్గనైజేషన్స్.. ఏఐ- సాధికారత కలిగిన సాఫ్ట్‌వేర్ కోసం నైపుణ్యం కలిగిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను నియమించుకునేందుకు చూస్తాయి.