2025 Keeway K300 SF Launched:వాహన ప్రియులకు గుడ్‌న్యూస్. ఇండియన్ మార్కెట్లోకి అదిరే డిజైన్‌లో కొత్త బైక్ ఎంట్రీ ఇచ్చింది. టూ-వీలర్ తయారీ సంస్థ కీవే ఇండియా 'కీవే K300 SF' పేరుతో దీన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త 'కీవే K300 SF' అనేది 2022లో భారత్‌లో ప్రారంభించిన 'కీవే K300 N' మోడల్ అప్డేటెడ్ వెర్షన్.
కంపెనీ ఈ మోటార్‌సైకిల్‌ను రూ. 1.69 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు విడుదల చేసింది. ఈ ధర పాత మోడల్ కంటే దాదాపు రూ. 60,000 తక్కువ. అయితే మొదటి 100 మంది కస్టమర్లకు మాత్రమే ఈ ప్రారంభ ధర వర్తిస్తుందని కంపెనీ తెలిపింది.
కీవే K300 SF డిజైన్:కంపెనీ ఈ కొత్త మోటార్ సైకిల్ డిజైన్‌లో ఎలాంటి మార్పులూ చేయలేదు. దీని డిజైన్ 'కీవే K300 N' స్ట్రీట్ ఫైటర్ మాదిరిగానే ఉంటుంది. ఈ కొత్త 'కీవే K300 SF' బైక్ పేరులోని SF అంటే స్ట్రీట్ ఫైటర్. కంపెనీ ఈ కొత్త బైక్ డిజైన్‌లో ఛేంజెస్ చేయనప్పటికీ దాని గ్రాఫిక్స్‌లో మాత్రం స్వల్ప మార్పులు చేసింది.
కలర్ ఆప్షన్స్: ఈ మోటార్‌సైకిల్ మూడు కలర్ ఆప్షన్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది.
- మ్యాట్ వైట్
- మ్యాట్ బ్లాక్
- మ్యాట్ రెడ్