తెలంగాణ

telangana

ETV Bharat / technology

స్టన్నింగ్ లుక్​లో మారుతీ సుజుకీ డిజైర్- ప్రీ బుకింగ్స్ స్టార్ట్- రూ.11,000 చెల్లిస్తే చాలు - 2024 MARUTI DZIRE

మారుతీ నుంచి నయా కారు- రిలీజ్​కు ముందే ప్రీ బుకింగ్స్

2024 Maruti Suzuki Dzire
2024 Maruti Suzuki Dzire (Maruti Suzuki India)

By ETV Bharat Tech Team

Published : Nov 5, 2024, 5:29 PM IST

2024 Maruti Suzuki Dzire:మార్కెట్లోకి మరికొద్ది రోజుల్లో సరికొత్త కారు రాబోతుంది. దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన అప్​డేటెడ్ మారుతి సుజుకి డిజైర్‌ను విడుదల చేయబోతోంది. లాంచ్ కాకముందే కంపెనీ ఈ కాంపాక్ట్ సెడాన్ కోసం మార్కెట్లో ప్రీ బుకింగ్ ప్రారంభించింది. ఈ కొత్త కారును కొనాలనుకునే వారు కేవలం రూ. 11,000 ప్రారంభ బుకింగ్ అమౌంట్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

2024 నవంబర్ 11వ తేదీన ఈ నాల్గో తరం మారుతి డిజైర్ ఇండియన్ మార్కెట్లో విడుదల కానుంది. దీని పాత మోడల్​లో ఫ్రంట్, వెనక భాగాలను అప్​డేట్​ చేస్తూ ఈ కారును డిజైన్ చేశారు. ఈ కాంపాక్ట్ సెడాన్ కొత్త ఇంటీరియర్‌తో పాటు సెగ్మెంట్-ఫస్ట్ సన్‌రూఫ్‌తో సహా అనేక కొత్త ఫీచర్లతో వస్తుంది.

2024 మారుతీ డిజైర్ పవర్‌ట్రెయిన్:

కొత్త మారుతి డిజైర్ కూడా​ మారుతి స్విఫ్ట్ 1.2-లీటర్, 3-సిలిండర్ Z-సిరీస్ పెట్రోల్ ఇంజిన్​తోనే వస్తుంది. ఈ ఇంజిన్‌తో మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఇంజన్ 80 బిహెచ్‌పి పవర్, 112 న్యూటన్ మీటర్ల టార్క్ అందిస్తుంది. అయితే ఈ కారు CNG వేరియంట్ తర్వాత పరిచయం చేస్తారా, లేదా అనేది తెలీదు.

మారుతి సుజుకి తన డిజైర్ బ్రాండ్‌ను 2008లో మొదటిసారిగా ప్రారంభించింది. ఆ తర్వాత ఈ కారులో అనేక మార్పులు చేసింది. ఇది లాంచ్ అయినప్పటి నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ సెడాన్​ను ఇప్పుడు కొత్త లుక్​లో, సరికొత్త ఫీచర్లతో లాంచ్ చేయనున్నారు. దీంతో మార్కెట్లో దీని సేల్స్ మరింత పెరిగే అవకాశాలున్నాయి.

ఈ కొత్త జనరేషన్ అప్​గ్రేడ్​ కారుతో దాని సేల్స్ ఇలాగే కొనసాగుతాయని కంపెనీ భావిస్తోంది. ఈ 2024 మారుతి డిజైర్​ ప్రీ బుకింగ్స్ అరేనా చైన్ అవుట్‌లెట్ల ద్వారా ఇప్పటికే కొనసాగుతున్నట్లు మారుతీ సుజుకీ తెలిపింది. దీంతోపాటు కొనుగోలుదారులు ఈ షోరూమ్‌లలో దేనిలోనైనా లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దీన్ని బుక్ చేసుకోవచ్చని సూచించింది.

రాయల్ ఎన్​ఫీల్డ్ ఫస్ట్ ఈవీ లుక్​ రివీల్- ఇది కదా అసలుసిసలైన ఎలక్ట్రిక్ బైక్ అంటే..!

పవర్​ఫుల్ ప్రాసెసర్​తో రియల్​మీ కొత్త స్మార్ట్​ఫోన్- ఇండియాలో ఈ ఫీచర్​తో వస్తున్న ఫస్ట్ ​ఫోన్ ఇదే!

ABOUT THE AUTHOR

...view details