Best Photo Editing Apps For Instagram Influencers : ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్‌ను కోట్లాది మంది వినియోగిస్తున్నారు. అందుకే అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్‌స్టాలో ఫొటోలు, వీడియోలను అప్లోడ్ చేస్తుంటారు. ఈ క్రమంలో మీరు ఇన్‌స్టా ఇన్ఫ్లుయెన్సర్గా ఉంటే ఫాలోవర్స్ కోసం మరింత గుడ్ కంటెంట్, మంచి క్వాలిటీ ఉన్న ఫొటోలు పెట్టడం ముఖ్యం. అందుకే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఉపయోగించే టాప్-10 ఉత్తమ ఫొటో ఎడిటింగ్ యాప్స్‌ను మీ ముందుకు తీసుకొచ్చాం.
1. Canva : ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందిన ఫొటో ఎడిటింగ్ యాప్‌లో కాన్వా ఒకటి. దీని ఇంటర్ఫేస్, బాగుంటుంది. సోషల్ మీడియా, ప్రెజెంటేషన్స్, పోస్టర్స్, బిజినెస్ కార్డ్స్ వంటి వాటిని గ్రాఫికల్‌గా, రిచ్‌గా చేయడానికి కాన్వా ఉపయోగపడుతుంది. ఇందులో ఫొటో ఎడిటింగ్ చేయడానికి అధునాతన ఫొటో, వీడియో ఎడిటింగ్‌పై నైపుణ్యాలు ఉండాల్సిన అవసరం లేదు.
2. VSCO : వీఎస్‌సీఓ అనేది ఫొటోగ్రఫీ, ఫొటో ఎడిటింగ్ కోసం ఉపయోగించే ఒక మొబైల్ యాప్. ఇది ఫొటో బ్రైట్నెస్, క్రాప్, ప్రీసెట్ ఫిల్టర్లను చేసే సాధనంగా ఉపయోగపడుతుంది. దీని పెయిడ్ వెర్షన్ కూడా ఉంది.
3. A Color Story : కలర్ స్టోరీ ఫొటో ఎడిటింగ్ యాప్‌ను చాలా ఈజీగా ఉపయోగించవచ్చు. దీంట్లో వినియోగదారులు ప్రీసెట్ ఫిల్టర్లను అప్లై చేయవచ్చు. ఈ యాప్ మూవబుల్ ఎఫెక్ట్స్, బేసిక్ ఎడిటింగ్ టూల్స్‌ను అందిస్తుంది.
4. FaceTune :ఫేస్ ట్యూన్ యాప్‌ను సెలబ్రిటీలు, ఇన్‌స్టా ఇన్ఫ్లూయెన్సర్లు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ యాప్ ఫొటో మానిప్యులేషన్‌లో ముఖం లేదా శరీరంలోని భాగాలను మార్చుకోవచ్చు.