Divvala Madhuri Road Accident : వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. దువ్వాడ వ్యవహారంపై గత కొన్ని రోజులుగా ఆయన భార్య వాణి తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం టెక్కలి వైఎస్సార్సీపీ నాయకురాలు, దువ్వాడ శ్రీనివాస్ స్నేహితురాలు దివ్వల మాధురి కారు ప్రమాదానికి గురయ్యింది.
దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో మరో ట్విస్ట్ - దివ్వల మాధురికి ప్రమాదం (ETV Bharat) శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం టోల్‌గేట్ వద్ద మాధురి కారు ప్రమాదానికి గురైంది. టోల్‌గేట్ వద్ద ఆగి ఉన్న కారును ఢీకొట్టింది. దీంతో మాధురి కారు పల్టీ కొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో మాధురికి గాయాలయ్యాయి. పలాస ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇది ప్రమాదమా? లేదంటే ఆత్మహత్యాయత్నమా? అనే కోణంలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాద సమయంలో మాదురి కాల్ మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. తాను డిప్రెషన్‌లో ఉన్నందున చనిపోయేందుకు బయటకు వచ్చినట్లు దువ్వల మాధురి పోలీసులకు తెలిపారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో ఆమె పేరు ఇటీవల చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.
"నన్ను ఎవరు ఢీ కొట్టలేదు. వేధింపులు తట్టుకోలేక నేనే ఆగి ఉన్న వాహనాన్ని ఢీ కొట్టాను. 140 స్పీడ్‌తో వచ్చి ఢీ కొట్టాను. నాకు ఎటువంటి ట్రీట్మెంట్ వద్దు. నన్ను చావనివ్వండి. నేను ఇంట్లో చాలా ప్లాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. నా వల్ల కావట్లేదు". - దివ్వల మాధురి
Duvvada Srinivas Family Controversy :కాగా శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం గత కొన్ని రోజులుగా చర్చనీయాంశంగా మారింది. గత కొంత కాలంగా విడిగా ఉంటున్న దువ్వాడ శ్రీనివాస్‌ను కలిసేందుకు కుమార్తెలు ఇంటికి వెళ్లగా, దువ్వాడ లోపలికి అనుమతించక పోవడంతో అర్ధరాత్రి వరకు గేటు వెలుపలే వారు ఉన్నారు. ఈ ఘటన స్థానికంగా పెద్ద దూమారాన్ని సృష్టించింది. దీనిపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి తీవ్రంగా స్పందించారు. తమ గౌరవాన్ని, కుటుంబ నేపథ్యాన్ని మంటగలుపుతున్నారంటూ మండిపడ్డారు. తన భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం నెరుపుతున్నారని, ఆమె ఉచ్చులో చిక్కుకున్నారని వాణి ఆరోపించారు.
అనంతరం దువ్వాడ వాణి వ్యాఖ్యలపై స్థానిక వైసీపీ మహిళా నాయకురాలు మాధురి స్పందించారు. దువ్వాడ శ్రీనివాస్, తన మధ్య ఉన్నది స్నేహం మాత్రమేనని, భవిష్యత్తులో ఎటైనా దారి తీయవచ్చని వ్యాఖ్యానించారు. ఇది జరిగిన కాసేపటికే దువ్వాడ వాణి, ఆమె కుమార్తె ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి వెళ్లి తమ కుటుంబానికి ఎటువంటి సంబంధంలేని మహిళను అతనితో కలసి ఉండటానికి ఒప్పుకునేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటి నుంచి మాధురి వ్యాఖ్యలపై పై సామాజిక మాధ్యమాలలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. స్నేహితురాలినే అని అంటూనే, ఈ బంధం భవిష్యత్‌లో ఎటైన దారి తీయొచ్చనే వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. ఈ క్రమంలో గత నాలుగరోజులుగా మీడియాలో వస్తున్న వార్తలను తట్టుకోలేకే తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు మాధురి తెలిపారు.
మరోసారి రచ్చకెక్కిన వైసీపీ ఎమ్మెల్సీ కుటుంబ వ్యవహారం - YSRCP MLC Duvvada Srinivas Issue
"ఈ ఇల్లు నాది వెళ్లిపోండి"- భార్య, కుమార్తెపై ఎమ్మెల్సీ బూతుపురాణం - Duvvada Srinivas Family Controversy