ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అదిరిన సీన్​ - పవన్​ను ఆలింగనం చేసుకున్న బొత్స - ముఖం చాటేసిన పెద్దిరెడ్డి - BOTSA HUGS PAWAN KALYAN

పవన్ కల్యాణ్ కారెక్కేందుకు వస్తుండటం చూసి వెళ్లి కలిసి మాట్లాడి బొత్స - చూసి పక్కకు వెళ్లిపోయిన పెద్దిరెడ్డి, ఇతర ఎమ్మెల్సీలు

botsa_hugs_pawan_kalyan
botsa_hugs_pawan_kalyan (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 22, 2024, 3:34 PM IST

Updated : Nov 22, 2024, 4:12 PM IST

Botsa Satyanarayana Hugs Deputy CM Pawan Kalyan: శాసనసభ ప్రాంగంణంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కారెక్కేందుకు వస్తుండగా అది చూసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఎదురుగా వెళ్లి పవన్​ని పలకరించేదుకు ప్రయత్నించారు. ఆ సమయంలో వైఎస్సార్సీపీ నేతలు పెద్దిరెడ్డి, ఇతర ఎమ్మెల్సీలు పక్కకు వెళ్లిపోయారు. పవన్ కల్యాణ్​కు బొత్స సత్యనారాయణ నమస్కారం పెట్టారు.

బొత్స స్పందనను చూసిన పవన్ కల్యాణ్ ఆయనకు ఎదురెళ్లి ఆలింగనం చేసుకున్నారు. బొత్స భుజంపై తట్టి మర్యాదపూర్వకంగా కరచాలనం చేసి నమస్కారం పెట్టారు. జరుగుతున్న పరిణామాల్ని దూరం నుంచి చూస్తూ వైఎస్సార్సీపీ నేతలు అయోమయంలో పడ్డారు. వాళ్లిద్దరినీ చూసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖం తిప్పుకుని వెళ్లిపోయారు.

సోషల్ మీడియాలో ట్రెండ్: ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్లు బొత్స వైఎస్సార్సీపీని వీడి జనసేనలో చేరుతున్నారని ప్రచారం చేస్తున్నారు. మరి కొందరు ఉన్న మిగతా వారు కూడా జగన్​ను వీడే రోజులు తొందర్లోనే ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు. దీనికి వైఎస్సార్సీపీ నేతల నుంచి కానీ కార్యకర్తల నుంచి కానీ ఎలాంటి స్పందన రావట్లేదు. మరి ముందు ముందు ఏం జరుగుతుందో వేచి చూడాలి.

ప్రభాస్‌ ఎవరో నాకు తెలియదు - నేను ఇంత వరకూ ఆయన్ను చూడలేదు : షర్మిల

తప్పు చేసి 'సారీ' అంటే ఊరుకుంటామా? - ఏ ఒక్కరినీ వదిలేదిలేదు : లోకేశ్

Last Updated : Nov 22, 2024, 4:12 PM IST

ABOUT THE AUTHOR

...view details