YSRCP MLA Vasantha Venkata Krishna Prasad :నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు అందరినీ కలుపుకొని టీడీపీలోకి వెళ్తానని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అన్నారు. అందరితో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరతానని విస్పష్టంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడు, లోకేశ్‌ను తిట్టే వారికే మంత్రి, ఎమ్మెల్యే, ఇతర పదవులు ఇస్తారని, ఆ రకంగా తిట్టడం తనకు అలవాటు లేదని అన్నారు. మైలవరం టిక్కెట్ ఇస్తాను అని చెబుతూనే చంద్రబాబు, లోకేశ్‌ను తిట్టమని సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పారని, దానికి తన మనసు అంగీకరించలేదన్నారు.
కాంగ్రెస్‌లోకి కొనసాగుతున్న వలసలు - బీఆర్ఎస్కు తీగల కృష్ణారెడ్డి రాజీనామా
'సీఎం జగన్ మోహన్ రెడ్డి స్వయంగా రెండుసార్లు చంద్రబాబు నాయుడు, లోకేశ్‌ను తిట్టమని చెప్పారు. కానీ, అందుకు నేను పూర్తిగా విరుద్ధమని చెప్పాను. ఆ రకంగా తిట్టి వచ్చే పదవులు, అధికారం తనకు అవసరం లేదు' అని అన్నానన్నారు. ఇటీవల లోకేశ్‌తో గంటసేపు సమావేశం అయ్యానని, ఆయన చాలా హుందాగా వ్యవహరించారన్నారు. ఈ సందర్భంగా మూడు, నాలుగు సార్లు సీఎం జగన్ మోహన్ రెడ్డి అని మాత్రమే లోకేశ్ ప్రస్తావించారని, అది ఆయన సంస్కారమని కొనియాడారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడు సీఎం కావాల్సిన అవసరం ఉందని వసంత స్పష్టం చేశారు. వైఎస్సార్ ప్రభుత్వంలో చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి ప్రజలను మోసం చేశారని, అభివృద్ధి లేని సంక్షేమం వల్ల ప్రయోజనం లేదని పేర్కొన్నారు.
అధికారుల ఉదాసీత - హైదరాబాద్‌లో దేవాలయ భూములకు శఠగోపం!
రాష్ట్రంలో పరిశ్రమలు, ఇతర ఉపాధి అవకాశాలు ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో వ్యక్తిగత విభేదాలు ఏమీ లేవని, రాజకీయ విభేదాలు మాత్రమే ఉన్నాయన్నారు. తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం ఉమామహేశ్వరరావుతో సమావేశం ఏర్పాటు చేస్తే అక్కడకు వెళ్లి కలుస్తానన్నారు. దేవినేనితో కలిసి ప్రయాణమని తెలిపారు. రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలన్నదే తన కోరిక అని అన్నారు. ఎంపీ కేశినేని నాని రాజధాని విషయంలో ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడటం కరెక్ట్ కాదని, రాజధానిపై నిర్ణయం తీసుకునే సమయంలో కేశినేని తెలుగుదేశంలోనే ఉన్నారని, పదేళ్లపాటు పాటు తెలుగుదేశంలో ఉండి ఇప్పుడు దానికి వ్యతిరేకంగా మాట్లాడటం ఏమిటని నిలదీశారు.
రాష్ట్రంలో కేసీఆర్‌పై కోపంతో కాంగ్రెస్‌ను గెలిపించారు - ఎంపీ ఓటు మాత్రం బీజేపీకే అంటున్నారు : ఈటల రాజేందర్
వ్యక్తిగతంగా దూషించిన సందర్భంలోనే దేవినేని ఉమాపై మాట్లాడానన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడు, లోకేశ్‌ను ఎవరైతే తిడతారో వారికి ఇస్తున్నారన్నారు. మైలవరం నియోజకవర్గానికి పక్కన ఉన్న నందిగామ, తిరువూరు నియోజకవర్గాలకన్నా మైలవరంలో ఎక్కువ అభివృద్ధి పనులు చేశానన్నారు. ఈ విషయంలో ఎంపీ కేశినేని నానితో చర్చకు సిద్ధమని అన్నారు. మైలవరం నియోజకవర్గ అభివృద్ధి గురించి నిధులు కేటాయించాలని అనేకసార్లు సీఎంను కలిసినా ప్రయోజనం లేదని వసంత కృష్ణ ప్రసాద్ తెలిపారు.
చంద్రబాబు లోకేశ్‌ను తిడితేనే పదవులా రాష్ట్రాభివృద్ధి బాబుతోనే సాధ్యం ఎమ్మెల్యే వసంత కాంగ్రెస్‌లో చేరిన జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత దంపతులు