తెలంగాణ

telangana

ETV Bharat / state

నాడు అహంకారంతో చెలరేగారు - నేడు అథఃపాతాళానికి పడిపోయారు! - YSRCP LEADERS IN JAIL

ఏపీలో వైఎస్సార్​సీపీ ప్రభుత్వ హయాంలో ఆరాచకాలు - అహంకారంతో ఎగిరిపడ్డ వాళ్ల గుండెళ్లో గుబులు

YSRCP Leaders In Jail IN AP
YSRCP Leaders In Jail IN AP (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 29, 2024, 5:49 PM IST

YSRCP Leaders in Jail in AP :అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టేశారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలకు, విలువలకు పాతరేశారు. ఠాణాలకు అడ్డాగా అక్రమాలు, అరాచకాలకు తెరలేపారు. పత్రికా కార్యాలయాలు, ప్రతిపక్ష నేతలపై దాడులకు బరితెగించారు. 5 ఏళ్ల వైఎస్సార్సీపీ సర్కారు పాలనలో జరిగిన తంతు ఇది.

అధికార మత్తులో అహంకారంతో చెలరేగిన నేతలు నేడు అథఃపాతాళానికి పడిపోయారు. రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్ప హత్యలు ఉండవనే విషయాన్ని రుజువు చేస్తున్నారు. పరారీలో కొందరు, ముందస్తు బెయిళ్ల కోసం ఇంకొందరు, జైళ్లలో మరికొందరు, ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయంతో ఎందరో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. నందిగం సురేష్, బోరుగడ్డ అనిల్, పానుగంటి చైతన్య అధినేత జగన్​ మెప్పు కోసం అరాచకాలు సాగించిన వైఎస్సార్సీపీ నేతలంతా ఒక్కొక్కరుగా జైలుకు క్యూ కడుతున్నారు. కాలం ఎవ్వరినీ విడిచిపెట్టదు. అందరికీ అన్నీ ఇస్తుంది. కొన్నిసార్లు కొంచెం ఆలస్యమవ్వచ్చేమో గానీ ఎవరికి దక్కాల్సింది వారికి అందుతుంది.

జగన్​తో నిందితుడు చైతన్య(ఫైల్​) (ETV Bharat)

"చంద్రబాబునాయుడు నీకు టికెట్ ఇస్తాడా? నువ్వు గెలుస్తావా? గవర్నమెంట్ ఏర్పాటు చేస్తాడా?" అంటూ అప్పట్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేపై కోటంరెడ్డిపై చెలరేగి మాట్లాడిన బోరుగడ్డ అనిల్ ఇప్పుడు రాజమహేంద్రవరం జైలులో ఊచలు లెక్కపెడుతున్నాడు. "నోరు జాగ్రత్త మా లీడర్​ జగన్‌, సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ పెద్దల జోలికి వస్తే బండికి కట్టి లాక్కుపోతా డేట్ ఫిక్స్ చేసుకో" అంటూ చేసిన బెదిరింపులను గుర్తు తెచ్చుకుని బోరున విలపిస్తున్నాడు.

మాజీ ఎంపీ నందిగం సురేశ్(ఫైల్​ పొటో) (ETV Bharat)

"బండ్లు ఓడలవుతాయి ఓడలు బండ్లవుతాయి" అనడానికి మాజీ ఎంపీ నందిగం సురేశ్ ఉదంతమే చక్కని ఉదాహరణ. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తుళ్లూరు పోలీసుస్టేషన్‌ అడ్డాగా చెలరేగిపోయిన సురేశ్.. ఇప్పుడు అదే స్టేషన్​లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బీజేపీ నేతల కాన్వాయ్​ను అడ్డగించి చేసిన దాడిలో నందిగం సురేష్‌, బోరుగడ్డ అనిల్‌ నిందితులుగా ఉన్నారు. ఏపీలోని వెలగపూడిలో జరిగిన మహిళ హత్య కేసులో నందిగం సురేష్, డబ్బుల కోసం బెదిరించిన కేసులో బోరుగడ్డ అనిల్ జైలు పాలయ్యారు.

వందలాది కార్యకర్తలను రెచ్చగొట్టి ఆంధ్రప్రదేశ్​ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడిన ఏ1 నిందితుడు పానుగంటి చైతన్యకు సైతం తత్వం బోధపడింది. తాడేపల్లి ఆఫీసులో సమావేశమైన పెద్దలు దాడికి రెచ్చగొట్టారని పోలీసు కస్టడీలో వెల్లడించిన చైతన్య నేడు రిమాండ్ ఖైదీగా గుంటూరు జైలులో గడుపుతున్నాడు.

"చర్యకు ప్రతిచర్య, మంచికి మంచి, చెడుకు చెడు" అనేదే కర్మ సిద్ధాంత సారాంశం. అధికారం మత్తులో, అహంకారంతో విర్రవీగిన వైఎస్సార్సీపీ నాయకులకు దక్కాల్సిన కర్మ ఫలాలు ఇప్పుడిప్పుడే అందుతున్నాయి. ఒక్కొక్కరుగా జైళ్లకు వెళ్తున్న వేళ ఆ పార్టీ పెద్దల్లో సైతం దడ పుట్టిస్తోంది.

టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసు - వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు - Notice to YSRCP Central Office

Kodali Nani Comments: 'మంత్రి పదవి నాకు వెంట్రుకతో సమానం'

ABOUT THE AUTHOR

...view details