YSRCP Leader Mallela Rajesh Naidu Followers Protest: చిలకలూరిపేటలో వైసీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. మల్లెల రాజేశ్ నాయుడుకు టికెట్ ఇవ్వకపోవడంతో జాతీయ రహదారిపై ఆయన అనుచరుల ఆందోళనకు దిగారు. కాగా మంగళవారం రాజేశ్‌ను తప్పంచి మనోహర్ నాయుడును ఇన్‌ఛార్జ్‌గా వైసీపీ అధిష్ఠానం నియమించింది.
మల్లెల రాజేశ్ నాయుడు సంచలన వ్యాఖ్యలు:మల్లెల రాజేశ్ నాయుడు మంగళవారం వైసీపీ అధిష్ఠానంపై అసంతృప్త వ్యాఖ్యలు చేశారు. మంత్రి రజిని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అయితే రాజేశ్‌ను తప్పించి వేరే వారికి టికెట్ ఇస్తారని ప్రచారం మొదలవడంతో, ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
మంత్రి విడదల రజిని తన వద్ద 6.5 కోట్ల రూపాయలు తీసుకున్నారని రాజేశ్ ఆరోపించారు. డబ్బుల విషయమై సజ్జల రామకృష్ణా రెడ్డికి చెబితే, కేవలం 3 కోట్ల రూపాయలు వెనక్కు ఇప్పించారని, మిగతా డబ్బులు ఇవ్వకుండా మంత్రి రజని తనను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సజ్జలను మార్చండి - పార్టీని బతికించండి - రూ. 6.5 కోట్లు తీసుకున్నారు
రాజేశ్‌కు వైసీపీ తొలి జాబితాలోనే చిలకలూరిపేట సమన్వయకర్తగా నియమించారు. అప్పటి వరకూ అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి రజినిని గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మార్చారు. తాజాగా రాజేశ్ చేసిన వ్యాఖ్యలతో ఆయనను పక్కన పెట్టి గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడిని సమన్వయకర్తగా మంగళవారం వైసీపీ అధిష్ఠానం నియమించింది.