ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ముంబయి నటిపై అక్రమ కేసు: వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్ అరెస్టు - 'కాంతిరాణా ముందస్తు బెయిల్ పిటిషన్' - Kukkala Vidya Sagar Arrest

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

Updated : 2 hours ago

YSRCP Leader Kukkala Vidya Sagar Arrest: ముంబయి హీరోయిన్​పై వేధింపుల కేసులో వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్​ను పోలీసులు అరెస్టు చేశారు. వేరే రాష్ట్రంలో ఉండగా విద్యాసాగర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

YSRCP Leader Kukkala Vidya Sagar Arrest
YSRCP Leader Kukkala Vidya Sagar Arrest (ETV Bharat)

YSRCP Leader Kukkala Vidya Sagar Arrest: ముంబయి నటి కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. కీలక నిందితుడు కుక్కల విద్యాసాగర్​ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. డెహ్రాడూన్​లో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం తెలిసింది. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు స్నేహితుని ఫోన్ వినియోగించాడు. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ముంబై నటిపై అక్రమ కేసు నమోదు వ్యవహారంలో పూర్తి విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి.

ముంబయి హీరోయిన్ కేసులో కీలక నిందితుడు కుక్కల విద్యాసాగర్​ను పోలీసులు అదుపులోకి తీసుకుని, విజయవాడలో విచారిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం దీనిపై పోలీసులు స్పందించటం లేదు. కుక్కల విద్యాసాగర్ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేశారని, ఆ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి తనను వేధించారని ముంబయి నటి ఇటీవల ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో విద్యాసాగర్​పై కేసు నమోదు చేశారు.

టెక్నికల్​గా దొరికిపోయారుగా!- సినీనటి ఫోన్​లోకి ఆ ముగ్గురు ఐపీఎస్​ల చొరబాటు - Jethwani Icloud Account Was Hacked

కీలక నిందితుడు విద్యాసాగర్​ను త్వరగా అరెస్ట్ చేయాలని హోంమంత్రి వంగలపూడి అనితను ముంబయి నటి కోరారు. విద్యాసాగర్ కొన్ని రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లి, స్నేహితులు, న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నారని పోలీసులు గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుడి సెల్ ఫోన్ సిగ్నల్స్, గూగుల్ టేక్ అవుట్ ద్వారా లొకేషన్​ను గుర్తించారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నిందితుడు విద్యాసాగర్ స్నేహితుడి ఫోన్​ని వినియోగిస్తున్నాడని గుర్తించారు. గుజరాత్, హైదరాబాద్, దిల్లీతో పాటు పలు ప్రాంతాలు తిరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఎట్టకేలకు నిందితుడు విద్యాసాగర్​ను అదుపులోకి తీసుకున్నారు.

ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో విద్యాసాగర్ ఏ1 గా ఉన్నాడు. తన స్థలానికి సంబంధించి నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి విక్రయించేందుకు ప్రయత్నించిందని తప్పుడు ఆరోపణలతో గతంలో విద్యాసాగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదుతో నటిని, ఆమె కుటుంబ సభ్యులను పోలీసులు అక్రమంగా తీసుకువచ్చి అరెస్ట్ చేసి వేధించారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ అధికారులు, ఏసీపీ,సీఐలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మరికొందరిపై విచారణ చేస్తున్నారు. విద్యాసాగర్​ను పోలీసులు విచారిస్తున్నారు. అతన్ని ఫిర్యాదు చేయమని గత ప్రభుత్వంలో కీలక వ్యక్తులు ప్రోత్సహించారా? దీని వెనుక ఎవరు ఉన్నారు? డాక్యుమెంట్స్ తయారు చేసిందెవరు? పూర్తి విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Kanti Rana Anticipatory Bail Petition: మరోవైపు ముంబయి నటి కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఐపీఎస్ అధికారి కాంతిరాణా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్​పై సోమవారం న్యాయస్థానం విచారణ జరపనుంది. ముంబయి నటి కేసులో నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించారని కాంతిరాణా ఇప్పటికే సస్పెండ్ అయ్యారు.

వైరల్ ఫొటో - హీరోయిన్​తో వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్ - ysrcp kukkala vidya sagar Issue

Last Updated : 2 hours ago

ABOUT THE AUTHOR

...view details