YSRCP Land Titling Act Trolls Viral in Social Media in AP :వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 'ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్' ప్రజల్లో ఆందోళనలను రేకెత్తిస్తోంది. రాష్ట్రంలో ఎక్కడ నలుగురు రైతులు కలిసినా దీని గురించే చర్చిస్తున్నారు. గ్రామాలు, పొలాలు, రచ్చబండల్లోనే కాకుండా సోషల్ మీడియా వేదికగా కొందరు రాష్ట్ర ప్రభుత్వ తీరును దుయ్యబడుతున్నారు. పలువురు మేధావులు, విపక్షలు ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై వీడియోలు, ట్రోల్స్ చేస్తూ వ్యంగ్యంగా విమర్శిస్తున్నారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై యువత, విద్యావంతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు తమ చేతికి టిడ్కో ఇళ్లను ఇవ్వకముందే తాకట్టు పెట్టి రుణం తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు తమ భూములను కూడా తనఖా పెట్టడానికే పట్టాలు తీసుకుంటున్నారా? అంటూ సర్కారును నిలదీస్తున్నారు. వైఎస్సార్సీపీ నాయకుల దందా స్టైలే అంతే అని మరికొందరు విమర్శిస్తున్నారు. ఇంకొందరు రైతుల కష్టం మీద మీ ఫొటో ఏంటని మండిపడుతున్నారు. పాస్ పుస్తకాలపై వేసే ఫొటోలు, కరెంట్ బిల్లు, చెత్త పన్ను మీద ఎందుకు వేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. భూ వివాదాలపై కోర్టుకు కూడా వెళ్లకుండా భూ భక్షక చట్టం తెచ్చిన జగన్ సర్కారుకు ఓటేస్తే మీ భూమితో మీకు రుణం తీరినట్లేనని న్యాయవాదులు హెచ్చరిస్తున్నారు.
ల్యాండ్ టైటిల్ యాక్ట్ పేరుతో జగన్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంది: న్యాయవాదులు - Lawyers On AP Land Titling Act
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ట్రోల్స్ :
- మీ బిడ్డా మీ బిడ్డా అంటే ఏంటో అనుకున్నాము. మా ఆస్తి పత్రాల కోసం అనుకోలేదయ్యా!
- ఒక్క అవకాశం ఇస్తే భూ పట్టాలపై మా ఫొటోలు లేకుండా చేశావు. మళ్లీ అవకాశం ఇస్తే మా భూములే లేకుండా చేస్తావేమో?
- సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన నరసింహ చిత్రంలోని ‘ పెళ్లి కొడుకు వీడే కానీ, వీడు వేసుకున్న డ్రెస్ మాత్రం నాదీ అన్నట్లు‘ పొలం వీడిదే కానీ పత్రాలు సర్కారువి’ అంటూ దాన్ని మార్చి విమర్శిస్తున్నారు.
- ‘జగనన్న కాలనీల పేరుతో స్థలాన్ని ఇచ్చిండు. భూ చట్టం పేరుతో ఎకరాలు లాగేస్తుండు’ అంటూ కొందరు ఎద్దేవా చేస్తున్నారు.
- విపక్ష పార్టీలు రూపొందించిన వీడియోలో నటుడు, జనసేన నాయకుడు పృథ్వీ వైఎస్సార్సీపీ నాయకుడిలా నటిస్తారు. ఓ రైతు వచ్చి నా భూమిని రాత్రికి రాత్రి మీ పేరున రిజిస్ట్రేషన్ చేసుకుంటారా అని ఆయనను నిలదీస్తారు. దానికి బదులుగా భలే వాడివమ్మా నీ భూమి అయితే నిరూపించుకో అని రైతుకు సవాల్ చేస్తారు. కోర్టుకు వెళ్లి నిరూపించుకుంటానని రైతు చెబుతుండగా, పృథ్వీ జోక్యం చేసుకొని కోర్టుల్లో నడవదమ్మా మీ లాయర్ చెప్పలేదా? ఇప్పుడు కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చాం.
భూ వివాద కేసులు ఏవీ కోర్టులో నడవవు. దీని కోసం టైటిలింగ్ రిజిస్టర్ ఆఫీసర్ (TRO) అనే అధికారి ఉంటారు. భూమి నీదేనని ఆ అధికారి దగ్గర నిరూపించుకోవాలి. నువ్వు అక్కడ నిరూపించుకోలేవు. ఎందుకంటే వాడిని నియమించేది మా ప్రభుత్వమే. కాబట్టి ఇప్పుడు మేం చెప్పిందే ఆ అధికారి వింటాడు. నువ్వు చేసేదేమీ లేదు కాబట్టి నువ్వే ఎంతకో కొంతకు సెటిల్ చేసుకుంటే మంచిదని అధికార నాయకుడు పాత్రలో నటిస్తారు. తమ భూమిని కాపాడుకోవడానికి దారులన్నీ మూసుకుపోయాయని అర్థమైన బాధితుడు నాకు ఆడపిల్ల ఉందయ్యా. మాకున్న ఆధారం ఆ భూమి ఒక్కటే. మీరేం చెబితే అదేనని తన నిస్సహాయతను వ్యక్తం చేస్తారు. ఇలా ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమల్లోకి వస్తే ప్రజలకు జరిగే నష్టాలను వీడియోల రూపంలో ప్రజలకు అర్థమయ్యాలా ముందుకు తీసుకువెళున్నారు.
- మహేశ్ బాబు నటించిన ' అతడు' సినిమాలో ఆయనకు తాతగా నటించిన నాజర్ తన భూమిని కబ్జా చేసిన తనికెళ్ల భరణిని ‘ఇదేంటి నాయుడు?’ అని ప్రశ్నిస్తాడు. దీన్ని కంచె అంటారు. ఇంగ్లిషులో ఫెన్సింగ్ అంటారని ఇప్పుడే ఎమ్మార్వో (MRO) చెబుతున్నాడు’ అని భరణి బదులిస్తాడు. పక్కనే ఉన్న ఎమ్మార్వో జోక్యం చేసుకొని 'ఈ భూమి మీదే అనిపిస్తే కోర్టుకు వెళ్లండి అది సివిల్ కేసు అవుతుంది. మా మీద దాడి చేస్తే క్రిమినల్ కేసు అవుతుంది. అదే నాయుడు లాంటి వారితో ఎందుకని భూమిని వదిలేస్తే సమయం మిగులుతుంది’ అని ఎమ్మార్వో చెబుతారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే ఇలాగే ప్రజల భూములు లాక్కుంటారని ఆ సన్నివేశంతో పోల్చి ట్రోల్ చేస్తున్నారు.
'ఆస్తి హక్కును హరించే చట్టమిది'- ల్యాండ్ టైటిలింగ్‌తో ఎవరికి మేలో చెప్పండి జగనన్న! - Lawyers Comments On Land Titling
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు నేనూ బాధితుడినే: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ - NARAYANA ON LAND TITLING ACT