వైఎస్సార్సీపీ కొత్త వ్యూహం - రూ.50 వేల నుంచి 15 లక్షలతో సొంత పార్టీ నాయకుల కొనుగోలు YSRCP is Setting A New Trend in Election Campaigns: ఎన్నికల ప్రలోభాల్లో వైసీపీ కొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది. సొంత పార్టీ నేతలకే కరెన్సీ కట్టలను ఎర వేస్తోంది. ఓటర్లను ప్రభావితం చేసే నాయకుడి స్థాయిని బట్టి ఒక్కొక్కరికి రూ.50 వేల నుంచి 15 లక్షల వరకూ పంపిణీ చేస్తున్నారు. అవినాష్‌రెడ్డి సారథ్యంలో జగన్ ఇలాకాలోనే ఈ కార్యక్రమం అమలవుతోంది. వచ్చే ఎన్నికలకు సీఎం జగన్ సొంత పార్టీ నాయకులనే కొనేస్తున్నారు. ఐదేళ్లలో ఎన్నడూలేని విధంగా పులివెందులలో కార్యకర్తలకు జగన్ భరోసా పేరుతో ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీన్ని తెరవెనక నడిపించేది ఎవరైనా, తెరముందు అవినాష్‌రెడ్డి అన్నీతానై చూసుకుంటున్నారు.
వివేకానందరెడ్డి హత్య తర్వాత పులివెందులలో పార్టీ శ్రేణుల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. ఐదేళ్లుగా మండలాల్లోని నాయకులకు ఎలాంటి పనులు అప్పగించకపోగా మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నాయకులు ఎక్కడ జారుకుంటారోననే ఆందోళన వైసీపీ పెద్దలను వెంటాడుతోంది. మండలానికి చెందిన వైసీపీ కీలక నేతలు సైతం ఐదేళ్లుగా అసంతృప్తితోనే కాలం వెల్లదీస్తున్నారు. ఇలాంటి తరుణంలో వచ్చే ఎన్నికలు వైసీపీకి అత్యంత ప్రతిష్టాత్మకం కావడంతో పాటు సొంత నియోజకవర్గంలోనే పరిస్థితి చేజారకూడదనే ఆందోళనతో జగన్ మోహన్ రెడ్డి ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన ముఖ్య నేతల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసి వారికి డబ్బులు పంపిణీ చేస్తున్నారు.
'సిద్ధం' అంటూ భీమిలిలో ఎన్నికల సమర శంఖం పూరించిన సీఎం జగన్
Money Distributed in Constituency Leaders: నియోజకవర్గంలోని 7 మండలాల నేతల జాబితాను సిద్ధం చేసి వారికి డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఊరికే ఇస్తున్నారనే అనుమానం లేకుండా "కార్యకర్తకు జగనన్న భరోసా" పేరుతో ఎంపీ అవినాష్ రెడ్డికి ఓ అర్జీ పెట్టుకునేలా ఫారం రూపొందించారు. వాటిలో వైసీపీ నాయకుడే తాను సమస్యల్లో ఉన్నానని తనకు సహాయం చేయాలని కోరినట్లు రాయిస్తారు. వైసీపీలో సదరు నేత హోదాను బట్టి లక్ష రూపాయలు లేదా 5 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. ఇంకా కీలకమైన నేత అయితే 10 లక్షల రూపాయల వరకు అందజేస్తున్నట్లు సమాచారం. సింహాద్రిపురం మండలంలో ఓ వైసీపీ నేతకు పది లక్షల రూపాయలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ డబ్బు జగనన్న ఇచ్చారని అవినాష్ రెడ్డి వారికి స్వయంగా చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
జగన్‌కు కమిషన్లు ఇవ్వలేక పరిశ్రమలు తరలిపోతున్నాయి- వైసీపీ ఓటమి ఖాయమైంది: చంద్రబాబు
పులివెందుల, లింగాల, వేంపల్లె, వేముల, సింహాద్రిపురం మండలాల్లో ఒక విడత డబ్బుల పంపిణీ పూర్తయింది. ఇంకా చక్రాయపేట, తొండూరు మండలాల్లో పంపిణీ చేయాల్సి ఉందని చెప్తున్నారు. ఎన్నికలు సమీపించే కొద్దే మరోసారి భారీగా పార్టీ నాయకులకు నగదు పంపిణీ చేయాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తొండూరు మండలంలో ఈనెల 26న ఎంపీ అవినాష్ రెడ్డి మహిళలకు రహస్యంగా చీరలు పంపిణీ చేశారనే ప్రచారం కొనసాగుతోంది.
అక్కసుతోనే తనపై అక్రమ కేసులు-వైసీపీ నేతల చరిత్రంతా నా వద్ద ఉంది: సూరా శ్రీనివాసులు రెడ్డి