ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజధానిపై కక్షతో ఓఆర్‌ఆర్‌ను తొక్కేసిన వైఎస్సార్సీపీ - రెండు ఎక్స్‌ప్రెస్‌వే పనుల్లో జాప్యం - Jagan Neglect Amaravathi ORR - JAGAN NEGLECT AMARAVATHI ORR

YSRCP Government is Ignoring Amaravathi Outer Ring Road: ఏ నగరమైనా శరవేగంగా అభివృద్ధి చెందేందుకు అవుటర్‌ రింగ్‌రోడ్డు ఎంతో దోహదపడుతుంది. అలాంటి ఓఆర్​ఆర్​ను జగన్​ ప్రభుత్వం గాలికొదిలేసింది. అమరావతికి చుట్టూ నిర్మించ తలపెట్టిన ఔటర్‌ రింగ్‌రోడ్డును వదిలేసి అనంతపురం నుంచి అమరావతికి ప్లాన్‌ చేసిన ఎక్స్‌ప్రెస్‌వేని తెరమరుగు చేసింది. అసలు ఓఆర్‌ఆర్‌తో అవసరమే లేదనే విధంగా జగన్‌ వ్యవహరించారు.

Etv BharYSRCP Government is Ignoring Amaravathi Outer Ring Road
YSRCP Government is Ignoring Amaravathi Outer Ring Road (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 24, 2024, 7:37 AM IST

Updated : Jun 24, 2024, 8:49 AM IST

YSRCP Government is Ignoring Amaravathi Outer Ring Road: ప్రభుత్వమేదైనా అభివృద్ధిని ఆకాంక్షించాలి. మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయాలి. అంతకు ముందున్న ప్రభుత్వం కీలక ప్రాజెక్టులను రాష్ట్రానికి తీసుకొస్తే తర్వాతి వారు వాటిని పూర్తిచేసి ప్రజలకు మేలు జరిగేలా చూడాలి. కానీ జగన్‌ వీటికి అతీతం. ఆయనకు తెలిసింది కేవలం విధ్వంసం మాత్రమే. అమరావతికి చుట్టూ నిర్మించ తలపెట్టిన ఔటర్‌ రింగ్‌రోడ్డుతో పాటు అనంతపురం నుంచి అమరావతికి ప్లాన్‌ చేసిన ఎక్స్‌ప్రెస్‌వేని తెరమరుగు చేయడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. పోనీ వీటికి ప్రత్యామ్నాయంగా తీసుకురావాలనుకున్న రహదారుల్లోనైనా ఆయన ముందడుగు వేశారా అంటే అదీ లేదు. ఇలాంటి తరుణంలో మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఓఆర్‌ఆర్‌కు, అనంత- అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు తక్షణం ఊపిరి పోయాలి. తక్షణం ఇవి మొదలైతే రెండు, మూడేళ్లలో వీటిని పూర్తిచేసే అవకాశం ఉంది.

ఆంధ్రాకు ఆర్థిక ఆయువుపట్టుగా అమరావతి- ప్రజా రాజధానిగా పునరుద్ధరణ - AP Capital Amaravati Development

చంద్రబాబు దృష్టి పెడితే ఓఆర్​ఆర్​ పరుగులు:ఏ నగరమైనా శరవేగంగా అభివృద్ధి చెందేందుకు అవుటర్‌ రింగ్‌రోడ్డు ఎంతో దోహదపడుతుంది. హైదరాబాద్‌ చుట్టూ ఉన్న ఓఆర్‌ఆర్‌ ఇందుకు ఉదాహరణ. దేశవ్యాప్తంగా పెద్ద నగరాలు, మెట్రో సిటీల్లో చాలావరకు ఓఆర్‌ఆర్‌లు నిర్మించుకుంటే, మిగిలినవి వాటిని నిర్మించే పనిలో ఉన్నాయి. కానీ గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఓఆర్‌ఆర్‌ను తెరమరుగయ్యేలా చేసింది. రాజధాని అమరావతి, విజయవాడ, గుంటూరు నగరాల చుట్టూ రూ.18 వేల కోట్ల అంచనాతో 185 కిలోమీటర్లతో అవుటర్‌ రింగ్‌ రోడ్డుకు నాడు చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించి, ఎన్‌హెచ్‌ఏఐ ద్వారా నిర్మించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఆ సంస్థ ప్రాజెక్ట్‌ ఇంప్లిమెంటేషన్‌ ఆఫీసును కూడా అప్పట్లోనే మంగళగిరి ప్రాంతంలో ఏర్పాటుచేసి, దీనికి ఓ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ను కూడా నియమించింది.

అమరావతిలో ముఖ్యమంత్రి పర్యటన - నిర్మాణాలను పరిశీలించనున్న చంద్రబాబు - CM Chandrababu Amaravati visit

ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు సమగ్ర ప్రతిపాదన కూడా సిద్ధం చేశారు. 185 కిలోమీటర్ల ఓఆర్‌ఆర్‌లో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో కృష్ణా 102 కిలోమీటర్లు, గుంటూరు జిల్లా పరిధిలో 83 కిలోమీటర్లు ఉంటుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కంచికచెర్ల, వీరులపాడు, జి.కొండూరు, మైలవరం, ఆగిరిపల్లి, బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరు, కంకిపాడు, తోట్లవల్లూరు కలిపి మొత్తం 10 మండలాల్లోని 49 గ్రామాల మీదగా ఓఆర్‌ఆర్‌ వెళ్తుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొల్లిపర, పొన్నూరు, తెనాలి, చేబ్రోలు, వట్టిచెరుకూరు, గుంటూరు, మేడికొండూరు, ఎడ్లపాడు, తాడికొండ, పెదకూరపాడు, అమరావతి మండలాల్లోని 38 గ్రామాల మీదగా ప్రయాణిస్తుంది. దీనిని ఆరు వరుసల యాక్సెస్‌ కంట్రోల్‌ ఎక్స్‌ప్రెస్‌వేగాను, రెండువైపులా సర్వీస్‌ రోడ్లు నిర్మించేలా ప్రతిపాదించారు. 3 చోట్ల టన్నెల్స్‌ కూడా నిర్మించనున్నారు. ఈ రహదారికి 150 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేయాలని అనుకున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 1,900 హెక్టార్లు, ఉమ్మడి గుంటూరు జిల్లాలో 3,325 హెక్టార్లు కలిపి మొత్తం 5,225 హెక్టార్లు అవసరమవుతుంది.

వైఎస్సార్సీపీ 2019లో అధికారంలోకి రావడంతోనే జగన్‌ అమరావతి ఓఆర్‌ఆర్‌ను పూర్తిగా పక్కన పెట్టేశారు. దీనిని కేంద్రం ఎన్‌హెచ్‌గా గుర్తించిందని, భూసేకరణపై నిర్ణయం తీసుకోవాలంటూ ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు పదేపదే రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పినా ఏమాత్రం పట్టించుకోలేదు. అసలు ఓఆర్‌ఆర్‌తో అవసరమే లేదనే విధంగా జగన్‌ వ్యవహరించారు. 185 కిలోమీటర్ల ఆరు వరుసల ఓఆర్‌ఆర్‌ స్థానంలో కేవలం 40 కిలోమీటర్ల మేర నాలుగు వరుసలతో విజయవాడ తూర్పు బైపాస్‌ నిర్మిస్తే చాలంటూ పదేపదే విజ్ఞప్తులు చేశారు.

చివరకు కేంద్రం చిన్నఅవుటపల్లి నుంచి కాజా వరకు 40 కిలోమీటర్ల తూర్పు బైపాస్‌కు మొగ్గుచూపింది. అయితే ఇది ఇంకా డీపీఆర్‌ దశ కూడా దాటలేదు. రాజధాని పనులు పరుగులు పెట్టించేందుకు ప్రణాళికలతో సిద్ధమైన సీఎం చంద్రబాబు తక్షణం ఓఆర్‌ఆర్‌పై దృష్టి సారించాలి. కేంద్రంతో మాట్లాడాలి. గతంలో మంజూరు చేసిన ఈ రహదారికి సమగ్ర పథక నివేదిక రూపొందించేలా చూడాలి. దీనికి అవసరమైన భూమిని తక్షణం సేకరించేలా కార్యాచరణ ఆరంభించాలి.

రాజధాని ప్రాంతంలో వేగంగా జంగిల్‌ క్లియరెన్స్ పనులు - ముళ్లకంపలు, చెట్ల తొలగింపు - Amaravati works

బెంగళూరుకు చెందినవారు, రాయలసీమలోని ఉమ్మడి అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలకు చెందిన వారంతా తక్కువ సమయంలో రాజధాని అమరావతికి చేరుకునేలా నాడు చంద్రబాబు ప్రభుత్వం అనంతపురం-అమరావతి యాక్సెస్‌ కంట్రోల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వేని ప్రతిపాదించింది.దీనికి కేంద్రం ఆమోదించి ఎన్‌హెచ్‌గా గుర్తించింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఎన్‌హెచ్‌-44లోని రాప్తాడు మండలం మరూరు వద్ద మొదలై నేరుగా అమరావతికి చేరుకునేలా 20వేల కోట్లతో 393.61 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌వేను మంజూరు చేసింది.ప్రధాన ఎక్స్‌ప్రెస్‌వేకు అదనంగా ఉమ్మడి కడప, ప్రకాశం జిల్లాల మీదగా 88.08 కిలోమీటర్లు, కర్నూలు నుంచి 75.65 కిలోమీటర్ల నాలుగు వరుసల కనెక్టింగ్‌ రహదారులు వచ్చి ఈ ప్రధాన ఎక్స్‌ప్రెస్‌వేలో కలిసేలా ప్రణాళిక సిద్ధం చేశారు.

ఇవన్నీ కలిపితే మొత్తం అనంతపురం- అమరావతి ఎక్స్‌ప్రెస్‌వే నిడివి 557.34 కిలోమీటర్లు.దీనికి ఎన్‌హెచ్‌-544 ఎఫ్‌గా సంఖ్య కూడా కేటాయించింది. ఇందులో తొలుత అనంతపురం నుంచి అమరావతి వరకు ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి సమాయత్తమయ్యారు. దీనికి 5,462.45 హెక్టార్ల భూమి అవసరమవుతుందని గుర్తించి పెగ్‌ మార్కింగ్‌ కూడా నిర్వహించారు.19 ప్యాకేజీలకుగాను,12 ప్యాకేజీల డీపీఆర్‌లు సైతం సిద్ధమయ్యాయి. ఇంతలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రావడంతో అదంతా ఆగిపోయింది.తొలుత జగన్‌ ప్రభుత్వం ఈ ఎక్స్‌ప్రెస్‌వేని అమరావతి వరకు కాకుండా చిలకలూరిపేట బైపాస్‌లో కలిపేందుకు ప్రతిపాదించింది. దీనికి అనుగుణంగా ఎన్‌హెచ్‌ అధికారులు డీపీఆర్‌లో మార్పులు చేసినా, తర్వాత జగన్‌ దీనిని విస్మరించారు.

రాజధాని పనులు ప్రారంభంతో మొక్కులు తీర్చుకుంటున్న రైతులు - Capital Women Paying Dues

అనంత- అమరావతిని పూర్తిగా పక్కనపెట్టిన జగన్‌ ప్రభుత్వం దాని స్థానంలో శ్రీసత్యసాయి జిల్లాలోని కొడికొండ సమీపంలోని కోడూరు నుంచి పులివెందుల నియోజకవర్గం మీదగా బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలోని ముప్పవరం వరకు 344 కిలోమీటర్ల మేర గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే మంజూరు చేయించింది. దీనికి బెంగళూరు- విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే అని పేరు పెట్టారు. వాస్తవానికి బెంగళూరు నుంచి ఎన్‌హెచ్‌-44లో 111 కిలోమీటర్లు ప్రయాణించి కోడూరు వరకు రావాలి.

అక్కడ నుంచి కొత్తగా నిర్మించే ఎక్స్‌ప్రెస్‌లో 344 కిలోమీటర్లు ప్రయాణించి ముప్పవరం చేరుకోవాలి. మళ్లీ ముప్పవరం నుంచి ఎన్‌హెచ్‌-16లో 110 కిలోమీటర్లు ప్రయాణించి విజయవాడ చేరుకోవాల్సి ఉంటుంది. అంటే మొత్తం 565 కిలోమీటర్లలలో 344 కిలోమీటర్లు మాత్రమే కొత్తగా నిర్మించే రహదారి. కానీ దీనికి బెంగళూరు-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే అంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం హడావిడి చేసింది. ఈ రహదారిలో 14 ప్యాకేజీలకుగాను 13 ప్యాకేజీలకు టెండర్లు పూర్తిచేసి గుత్తేదారులకు పనులు అప్పగించారు.

చంద్రబాబు ఇప్పుడు అనంతపురం- అమరావతి ఎక్స్‌ప్రెస్‌వేకి తక్షణం జీవం పోయాలి. దీనికి గతంలోనే కేంద్రం ఎన్‌హెచ్‌గా గుర్తించి, సంఖ్యను కూడా కేటాయించడంతో వేగంగా డీపీఆర్‌ల రూపకల్పన, తర్వాత టెండర్లు పిలిచి, పనులు చేపట్టేందుకు జాప్యం ఉండదు. అవసరమైన భూముల కోసం పెగ్‌ మార్కింగ్‌ కూడా చేసినందున భూసేకరణ కూడా చకచకా సాగేందుకు వీలుంటుంది. రాజధాని ప్రాంతంలో భూముల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ముందుగా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో భూసేకరణ పూర్తిచేయాలి. వెంటనే పనులు ఆరంభించేలా చేయగలిగితే మూడేళ్లలో పూర్తయ్యేందుకు అవకాశం ఉంటుంది.

అమరావతిలో విశ్వవిద్యాలయాలకు దారి చూపండి - ప్రభుత్వానికి సహకరిస్తామని యాజమాన్యాల భరోసా - Universities at Amaravati

Last Updated : Jun 24, 2024, 8:49 AM IST

ABOUT THE AUTHOR

...view details