తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీ హోం మంత్రి అనితతో వైఎస్ సునీత భేటీ - తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయంపై వివరణ - YS Sunitha Met Home Minister Anitha - YS SUNITHA MET HOME MINISTER ANITHA

YS Sunitha Met AP Home Minister Anitha : ఏపీ హోం మంత్రి అనితను వైఎస్ వివేకా కుమార్తె సునీత కలిశారు. తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయంపై అనితకు ఆమె వివరించారు. ప్రస్తుతం సీబీఐ విచారణలో ఉన్న కేసుకు సంబంధించి సంపూర్ణ సహకారం ఉంటుందని అనిత భరోసా ఇచ్చారు.

YS Viveka Murder Case
YS Sunitha Met AP Home Minister Anitha (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 7, 2024, 12:19 PM IST

YS Sunitha Met AP Home Minister Anitha :ఏపీహోం మంత్రి వంగలపూడి అనితతో వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత భేటీ అయ్యారు. తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయంపై అనితకు సునీత వివరించారు. వివేకా హత్య తదనంతర పరిణామాలను హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో స్థానిక పోలీసులు హంతకులకు అండగా నిలిచారనీ, వారిపై చర్యలు తీసుకోవాలని సునీత కోరారు. కేసు విచారణ జరుపుతున్న సీబీఐ అధికారులపై తప్పుడు కేసులు పెట్టడంతో పాటు సాక్ష్యుల్ని బెదిరించి పోలీసులు కేసును నీరుగార్చే విధంగా వ్యవహరించారని తెలిపారు.

తప్పు చేసిన పోలీసులను వదిలిపెట్టం :ప్రస్తుతం సీబీఐ విచారణలో ఉన్న కేసుకు సంబంధించి సంపూర్ణ సహకారం ఉంటుందని అనిత భరోసా ఇచ్చారు. దోషులకు శిక్షపడేలా చూసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్న అనిత, తప్పు చేసిన పోలీసులను వదిలిపెట్టమని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details