YS SHARMILA ELECTION CAMPAIGN: జగన్ మోహన్ రెడ్డి మెగా డీఎస్సీ అని దగా డీఎస్సీ ఇచ్చారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఎన్నికలు 2 నెలలు ఉందనగా ఇప్పుడే డీఎస్సీ గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో షర్మిల ఎన్నికల ప్రచారంలో షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ప్రత్యేక హోదా విషయంలో మోదీని నిలదీసే ధైర్యం రాష్ట్ర నేతలకు లేదని షర్మిల విమర్శించారు. పదేళ్లలో రాష్ట్రానికి 10 పరిశ్రమలైనా వచ్చాయా అని ప్రశ్నించారు. చక్కెర పరిశ్రమలు మూతపడితే తెరిపించాలన్న ఆలోచన లేదని మండిపడ్డారు. కుంభకర్ణుడు ఆరు నెలలే నిద్రపోతాడని, జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఐదేళ్లు నిద్రపోయి ఎన్నికలప్పుడు లేచారని ధ్వజమెత్తారు. ఇప్పుడు సిద్ధమంటూ బయల్దేరారని, అప్పులు చేయడానికా, మళ్లీ మోసం చేయడానికా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐదేళ్లు ఉద్యోగాలివ్వకుండా ఇప్పుడు మేల్కొంటారా - జగన్పై మండిపడ్డ షర్మిల - YS SHARMILA ELECTION CAMPAIGN
రాజధాని కట్టలేని నేతలకు ఓట్లేందుకు?- రైతులకు అన్యాయం జరుగుతుంటే జగన్ ఏం చేస్తున్నారు: షర్మిల వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ ప్రత్యేక హోదా కోసం ఒక్క ఉద్యమమైనా చేశారా అని షర్మిల ప్రశ్నించారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే యువతకు ఉద్యోగాలు వచ్చేవని తెలిపారు. రాష్ట్రానికి రాజధాని కట్టగలిగారా అని నిలదీశారు. రాజధాని కూడా కట్టలేని నేతలకు ఓట్లు ఎందుకు వేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు అన్యాయం జరుగుతుంటే జగన్ ఏం చేస్తున్నారని మండిపడ్డారు. పూర్తిగా మద్యపాన నిషేధం చేయకపోతే ఓట్లే అడగనన్నారని, ఇప్పుడు సర్కారే మద్యం అమ్ముతోందని షర్మిల విమర్శించారు. నాసిరకం మద్యం తీసుకొచ్చి అమ్మడం వలన, అది తాగి అనేక మంది చనిపోతున్నారని ఆరోపించారు.
వైఎస్ పేరును సీబీఐ చార్జీషీట్లో చేర్పించింది జగనే: షర్మిల - YS Sharmila on CM Jagan