YS Sharmila Fires on Vijayasai Reddy: వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై, ఎంపీ విజయ సాయి రెడ్డిపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. విజయసాయి రెడ్డి చదివింది జగన్ మోహన్ రెడ్డి స్క్రిప్ట్ కాదని ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. ఆస్తుల గురించి నలుగురు చిన్న బిడ్డలకు సమాన వాటా ఉంటుందన్న YSR మ్యాండేట్ అబద్ధం అని మీ బిడ్డల మీద ప్రమాణం చేయగలరా అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మండిపడ్డాడరు.
"మీరు కూడా జగన్ మోహన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగిన వాళ్లే. రాజకీయంగా,ఆర్థికంగా జగన్ వల్ల బలపడిన వాళ్లే. మీరు ఇలా కాకపోతే ఎలా మాట్లాడుతారులే. YSR మరణానికి కాంగ్రెస్ ముమ్మాటికీ కారణం కాదు. రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది YSR. బంగారు బాతును ఎవరూ చంపుకోరు. సొంత కళ్లను ఎవరూ పొడుచుకోరు. YSR మరణానికి చంద్రబాబు కారణం అయితే మీరు అధికారంలో ఉండి 5 ఏళ్లు గాడిదలు కాశారా?
మీ చేతకానితనానికి నిదర్శనం కాదా: ప్రత్యేక విచారణ ఎందుకు జరిపించలేదు? దర్యాప్తు చేసి నిజానిజాలు ఎందుకు బయట పెట్టలేదు? దోషులను ఎందుకు శిక్షించలేదు అనుమానం ఉండి, 5 ఏళ్లు అధికారంలో ఉండి, ఎందుకు ఒక్క ఎంక్వైరీ కూడా వెయ్యలేదు? ఇది మీ చేతకానితనానికి నిదర్శనం కాదా? YSR మరణం తర్వాత ఛార్జిషీట్లో ఆయన పేరు చేర్పించింది మీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి కాదా? కేసుల నుంచి బయట పడటానికి పొన్నవోలుతో కలిసి ఈ కుట్ర చేయలేదా?