Youth Protest with Drone Visuals to Repair Roads: వైఎస్సార్సీపీ హయాంలో ప్రజలు నరకయాతన అనుభవించారు. రోడ్లు సరిగా లేక ఎన్నో అవస్థలు పడ్డారు. రోడ్లు బాగు చేయాలని ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రతిపక్షాలు సైతం వైఎస్సార్సీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ప్రత్యేక నిధులు ఏర్పాటు చేసి రోడ్లు వేస్తోంది.
ఇటీవలే అల్లూరి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించి పలు ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అన్ని ప్రాంతాల్లో రోడ్లు వేస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇదిలావుంటే విజయనగరం జిల్లా వంగర మండలం బాగెమ్మపేట నుంచి కొండవలస జంక్షన్ వరకు రహదారి పూర్తిగా గోతులమయం అయ్యింది. ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామ యువత డ్రోన్ విజువల్స్ ప్రదర్శిస్తూ రహదారి బాగు చేయాలని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.