ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యువకుడి ప్రాణం తీసిన క్రికెట్ గ్రౌండ్ - కత్తులు, రాళ్లతో దాడి - YOUTH DIED IN PLAYGROUND DISPUTE

నెల్లూరు జిల్లా కొండాయపాలెంలో ఆట స్థలం వివాదంలో యువకుని హత్య - కత్తులు, రాళ్లతో ఇరువర్గాల ఘర్షణ

YOUTH DIED IN PLAYGROUND DISPUTE
YOUTH DIED IN PLAYGROUND DISPUTE (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 6, 2025, 10:29 PM IST

Youth Died in Playground Dispute:ఆట స్థలం వివాదం ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తమ క్రీడా మైదానంలో క్రికెట్ ఆడుతున్నారని అక్కసుతో చివరికి ఆ యువకుడిని ప్లాన్ ప్రకారం కొంతమంది యువకులు బలిగొన్నారు. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం కొండాయపాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఆట స్థలం వివాదంలో యువకుని దారుణ హత్య:నెల్లూరు జిల్లాలోని కొండాయపాలెం గ్రామంలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. రెండువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో అభిషేక్ (22) అనే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనలో చింటూ, ఉదయ్ అనే మరో ఇద్దరికి సైతం తీవ్రంగా గాయాలయ్యాయి. దాసు అనే వ్యక్తితో మరికొంత మంది కలిసి వీరిపై ఆయుధాలతో దాడి చేశారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. వేదాయపాలెం 5వ పట్టణ పరిధిలోని పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు.

యువకుడి ప్రాణం తీసిన క్రికెట్ గ్రౌండ్ - కత్తులు, రాళ్లతో దాడి (ETV Bharat)


ఆట స్థలం వివాదమే కారణం: కొండాయపాలెం గ్రామ సమీపంలో గల చర్చి ఆవరణలో ఉన్న ఓ స్థలంలో క్రికెట్ ఆడే మైదానం గురించి రెండు వర్గాల మధ్య తరచూ వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో స్థలం గురించి ఇవాళ మరోసారి ఇరు వర్గాల యువకులు పరస్పరం గొడవకు దిగారు. కత్తులు, రాళ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో 22 ఏళ్ల అభిషేక్ మృతి చెందాడు. చింటూ, ఉదయ్​కు తీవ్ర గాయాలయ్యాయి. దాసుతో పాటు మరికొందరు కలిసి తమ వారిపై పక్కా ప్లాన్ ప్రకారమే ఆయుధాలతో దాడి చేశారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై వేదాయపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విధి ఆడిన వింత నాటకం - ప్రమాదం చూసేందుకు వెళ్తే ప్రాణమే పోయింది

పారిపోయిన ప్రేమజంట - పెళ్లి చేస్తామని ఇంటికి పిలిపించాక ఏమైందంటే!

ABOUT THE AUTHOR

...view details