Srivari Trimasika Metlotsavam Started In Tirumala : శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం బుధవారం తెల్లవారుజామున తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద వైభవంగా జరిగింది. టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి పీఆర్ ఆనందతీర్థాచార్య ముందుగా మెట్లపూజ నిర్వహించి మెట్లోత్సవాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా భానుప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి అనుగ్రహంతో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో శ్రీవారి మెట్లోత్సవం నిర్విఘ్నంగా జరుగుతుందని తెలియజేశారు. మానవులు జ్ఞాన పూర్వకంగా, శ్రద్ధతో, యోగ్యతానుసారంగా పని చేయాలని, శ్రేయో మార్గమైన ఇలాంటి అంశాలను అలవరుచుకుంటే జీవనం సుఖమయం అవుతుందని వివరించారు.
తిరుమలకు పెరిగిన భక్తులు - అలిపిరి వద్ద భారీగా వాహనాల రద్దీ
శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో ఛైర్మన్ - తిరుమలలో గాయని సునీత సందడి