CM Chandrababu Inaugurates KIMS Shikhara Hospital: ఆరోగ్యం, ఆనంద సమాజమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. ఆ దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. గుంటూరు నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన కిమ్స్ శిఖర ఆసుపత్రిని చంద్రబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సత్య కుమార్, నారాయణ, అచ్చెనాయుడు, దుర్గేశ్, ఆనం రామనారాయణరెడ్డి, గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.
రాబోయే రోజుల్లో డేటానే సంపద: 2000వ సంవత్సరంలో కిమ్స్ మొదటి ఆసుపత్రిని ప్రారంభించానని సీఎం చంద్రబాబు తెలిపారు. 25 ఏళ్లలో 5 వేల బెడ్స్తో 5 రాష్ట్రాలకు కిమ్స్ ఆసుపత్రి సేవలు విస్తరించాయని అన్నారు. 1995లో ఐటి గురించి చెప్పానని ఇప్పుడు ఏఐ గురించి చెప్తున్నానని అన్నారు. ప్రస్తుతం ఏఐ ప్రపంచాన్ని శాసిస్తోందన్న చంద్రబాబు రాబోయే రోజుల్లో డేటానే సంపద అవుతోందని పేర్కొన్నారు.
జెనిటికల్ పరీక్షలు ద్వారా ఎటువంటి రోగాలు రాబోతున్నాయో తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. పేదలు అనారోగ్య సమస్యలతో ఆర్ధికంగా చితికిపోతున్నారని వెల్లడించారు. వైద్య ఖర్చుల్ని తగ్గించాల్సిన అవసరం ఉందని ప్రైవేట్ ఆసుపత్రులు పరీక్షల పేరిట ప్రజలను దోచుకుంటే సహించమని సీఎం హెచ్చరించారు.
దస్త్రాల పరిష్కారం, పాలనలో స్పీడ్ పెంచాలి : సీఎం చంద్రబాబు
పీ4 మోడల్ విధానానికి శ్రీకారం: 2047 స్వర్ణాంద్ర సాధన ద్వారా వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. సమర్థవంతమైన నాయకుడు, సుస్థిర పాలన ఉంటేనే అభివృద్ధి ఉంటుందని 2019లో టీడీపీ గెలిచి ఉంటే ఇంత విధ్వంసం జరిగి ఉండేది కాదని అన్నారు. 900లకు పైగా పడకలతో అత్యుత్తమ వైద్యం అందించేందుకు మంగళగిరిలో ఎయిమ్స్ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తే గత ప్రభుత్వం కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. ప్రతీ నియోజకవర్గంలో 300 పడకలతో స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చేస్తున్నామని వివరించారు. ఇంకా పేదలకు మెరుగైన పాలన అందించేందుకు ఉగాది నుంచి పీ4 మోడల్ విధానానికి శ్రీకారం చుడుతున్నానని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
"వైద్య ఖర్చుల్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ ఆసుపత్రులు పరీక్షల పేరిట ప్రజలను దోచుకుంటే సహించేది లేదు. త్వరలో ఆయుష్మాన్ భవలో భాగస్వాములవుతాం. నేచురల్ ఫుడ్‌లో రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేస్తున్నాం. దేశంలో ఉత్పత్తయ్యే గ్రీన్ ఎనర్జీలో 1/3 ఏపీలో చేయబోతున్నాం. ప్రతిఒక్కరూ ఎలక్ట్రిక్ వెహికిల్స్ వాడే రోజు రావాలి. కాలుష్యం, పారిశుద్ధ్యం మెరుగుపడితే రోగాలు దూరమవుతాయి. పేదలకు అందుబాటులో మెరుగైన పాలన ఇచ్చేలా ముందుకెళ్తున్నాం".- చంద్రబాబు, సీఎం
ఏపీలో మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం: సీఎం చంద్రబాబు
జగన్ ప్రభుత్వం చేసిన తప్పులన్నీ ఒక్కొక్కటీ సరిదిద్దుతున్నాం: మంత్రి కొల్లు