తెలంగాణ

telangana

ETV Bharat / state

హనీట్రాప్ చేసి అంతమొందించారు - పోలీసుల ఎదుట లొంగిపోయిన స్థిరాస్తి వ్యాపారి హత్య కేసు నిందితులు - A Realtor Stabbed to Death HYD

Yousufguda Realtor Murder Case Updates : హైదరాబాద్‌లో కలకలం సృష్టించిన స్థిరాస్తి వ్యాపారి పుట్ట రాము అలియాస్ సింగోటం రామన్న హత్య కేసులో పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పాత కక్షలు, వివాహేతర సంబంధాలే హత్యకు ప్రధాన కారణమని దర్యాప్తులో వెల్లడైంది. ప్రధాన నిందితుడు మణికంఠ, రౌడీ షీటర్ జిలానీ, అతని అనుచరులు కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

Yousufguda Realtor Murder Case Updates
Yousufguda Realtor Murder Case Updates

By ETV Bharat Telangana Team

Published : Feb 9, 2024, 7:59 AM IST

స్థిరాస్తి వ్యాపారి పుట్ట రాము హత్య కేసులో ఐదుగురి అరెస్టు

Yousufguda Realtor Murder Case Updates : నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌కు చెందిన పుట్టా రాము అలియాస్ సింగోటం రామన్న బుధవారం రాత్రి హైదరాబాద్‌ యూసుఫ్‌గూడాలోని లక్ష్మీనరసింహనగర్‌లో దారుణ హత్యకు గురయ్యాడు. ఓ మహిళ ద్వారా అతనికి ఫోన్ చేయించి ఘటనా స్ధలానికి రప్పించిన నిందితులు, పథకం ప్రకారం హత్య చేశారు. పది మందికి పైగా అతనిపై కత్తులతో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. అతని మర్మాంగాలను కోసి అతి కిరాతకంగా హతమార్చారు.

Yousufguda Realtor Brutal Murder Case :సమాచారం అందుకొని ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా అసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు వెళ్లిన దారిలో గాలింపు చర్యలు చేపట్టారు. దాడికి పాల్పడిన ప్రధాన నిందితుడు మణికంఠగా(Yousufguda Murder Case) గుర్తించారు. మాదాపూర్‌కు చెందిన రౌడీషీటర్ జిలానీతో పాటు అతని అనుచరులతో కలిసి హత్య చేసినట్లు గుర్తించారు.

రంగారెడ్డి జిల్లాలో జంట హత్యలు - డబ్బు పంచాయితీలో తండ్రి, మేనమామను చంపిన యువకుడు

మణికంఠ, మృతుడు రాము గతంలో స్నేహితులని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఇద్దరు కలిసి స్థిరాస్తి, ఇతర వ్యాపారాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వ్యాపారంలో మనస్పర్థలు రావడంతో కొన్నేళ్ల క్రితం ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మణికంఠ, ముఖానికి సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. ఈ ఘటనపై పేట్‌ బషీరాబాద్ ఠాణాలో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. వీరిద్దరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

A Realtor Stabbed to Death in Hyderabad :అప్పటి నుంచి రాముపై (Singotam Ramu) మణికంఠ కక్ష పెంచుకున్నాడు. గతంలో ఇద్దరూ స్నేహితులుగా ఉన్నప్పుడు యూసుఫ్‌గూడాలోని ఓ మహిళ వద్దకు తరచూ వెళ్లేవారని పోలీసులు గుర్తించారు. అదేక్రమంలో ఆమె కుమార్తెతో సైతం వీరికి పరిచయం ఉన్నట్లు తేలింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న మణికంఠ, మాదాపూర్‌కు చెందిన రౌడీషీటర్ జిలానీకి విషయం చెప్పాడు. ఇద్దరు కలిసి రాము హత్యకు పథకం వేశారని దర్యాప్తులో తేలింది.

రూ.500 కోసం గొడవ- ఫ్రెండ్​ కన్ను పీకేసి గొంతు కోసి హత్య

ఈ నేపథ్యంలోనే మణికంఠ బుధవారం రాత్రి యువతితో రాముకు ఫోన్ చేయించారు. ఘటనా స్థలానికి రావాల్సిందిగా హనీట్రాప్ చేయించారు. యువతి ఫోన్ చేయడంతో అక్కడికి వెళ్లిన రాముపై మణికంఠ, జిలానీ, అతని ముఠా కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. కొందరు కత్తులతో దాడి చేస్తుండగా, మరికొందరు అతని మర్మాంగాలను కోసేశారు. తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి ఒంటిపై సుమారు 60కి పైగా కత్తిగాట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్న సమయంలో ప్రధాన నిందితుడు మణికంఠ, జిలానీతో పాటు మరో ముగ్గురు పోలీసుల ఎదుట లొంగిపోయారు. హత్య అనంతరం తాను విజయం సాధించానని మణికంఠ బాణాసంచా కూడా కాల్చినట్లు సమాచారం.

పట్టపగలే ప్రియురాలిని దారుణంగా హత్య చేసిన ప్రియుడు

సినిమాను తలపించేలా హత్య - వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను చంపించిన భార్య

ABOUT THE AUTHOR

...view details