తెలంగాణ

telangana

ETV Bharat / state

పట్టపగలే ప్రియురాలిని దారుణంగా హత్య చేసిన ప్రియుడు - నిర్మల్​లో యువతి దారుణ హత్య

Young Woman Murder on Road at Nirmal : పట్టపగలే నడిరోడ్డుపై ప్రేయసిని ప్రేమికుడు అతిదారుణంగా హత్య చేసి చంపాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన నిర్మల్​ జిల్లా ఖానాపూర్​లోని శివాజీ నగర్​ జరిగింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Young Man Murder Young Woman
Woman Murder

By ETV Bharat Telangana Team

Published : Feb 8, 2024, 3:13 PM IST

Updated : Feb 8, 2024, 6:05 PM IST

Young Woman Murder on Road at Nirmal : ప్రేయసిని ప్రేమికుడు పట్టపగలే కత్తితో దారుణంగా నరికి హత్య(Woman Murder) చేశాడు. ఈ దారుణ ఘటన నిర్మల్​ జిల్లా ఖానాపూర్​లోని శివాజీ నగర్​లో జరిగింది. ఈ దాడిలో ప్రేమికురాలు అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. దాడిని అడ్డుకున్న ఆమె వదిన, రెండేళ్ల బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. దాడి చేసిన అనంతరం ప్రేమికుడు జూకంటి శ్రీకాంత్​(27) అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు గాయపడిన వీరిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, దర్యాప్తును ప్రారంభించారు.

డీఎస్పీ గంగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఖానాపూర్​ పట్టణంలోని అంబేడ్కర్​ నగర్​ కాలనీకి చెందిన జూకంటి శ్రీకాంత్​, అలేఖ్య(20) తొమ్మిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను కాదని యువతి తల్లిదండ్రులు వేరే వ్యక్తితో వివాహం నిశ్చయించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రేమికుడు యువతి ఇంటికి వెళ్లి గొడవకు దిగాడు. ఈ వివాదం పెద్దల సమక్షంలో పరిష్కారమైంది.

ప్రేమ పెళ్లి చేసుకుందని దారుణం- కూతురు, అల్లుడు, మనవరాలి దారుణ హత్య

Telangana Crime News : గురువారం మధ్యాహ్నం టైలరింగ్​ నేర్చుకోవడానికి వెళ్లిన అలేఖ్య , షాపు నుంచి తిరిగి ఇంటికి వస్తుండగా శ్రీకాంత్​ కత్తితో దాడి చేశాడు. వెంటనే దాడిని అడ్డుకోబోయిన ఆమె వదిన, పక్కనే ఉన్న రెండేళ్ల చిన్నారిపై కూడా విచక్షణరహితంగా దాడికి తెగబడ్డాడు. ప్రేమికుడు జరిపిన దాడిలో ప్రియురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆమె వదినకు తీవ్ర గాయాలు అయ్యాయి. మరో బాలుడి తలకు గాయాలయ్యాయి. దాడి చేసిన అనంతరం శ్రీకాంత్​ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దాడిని గమనించిన స్థానికులు వెంటనే గాయపడిన వారిరువురిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు.

"ఖానాపూర్​ పట్టణంలోని అంబేద్కర్​ నగర్​కు చెందిన జూకంటి శ్రీకాంత్​,అలేఖ్యతొమ్మిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆ తర్వాత ఆ యువతికి వేరే వ్యక్తితో తల్లిదండ్రులు వివాహం నిశ్చయించినారు. వీరిద్దరి మధ్య వివాదం వస్తే పెద్ద సమక్షంలో సామరస్యంగా పరిష్కారం జరిగింది. ఆమె వెంట పడవద్దని వారు యువకుడికి చెప్పగా సరేనని ఒప్పుకున్నాడు. అయితే ఈ రోజు మధ్యాహ్నంఅలేఖ్యటైలరింగ్​ నేర్చుకుని ఆమె వదినతో వస్తున్న సమయంలో రోడ్డుపై అతి దారుణంగా నరికి చంపడం జరిగింది. ఈ విషయంపై ప్రత్యేక టాస్క్​ఫోర్స్​ను ఏర్పాటు చేశాం. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటాము."- గంగారెడ్డి, డీఎస్పీ

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ గంగారెడ్డి తెలిపారు. ఈ ఘటనపై మంత్రి సీతక్క స్పందించి నిందితుడిని త్వరగా పట్టుకోవాలని ఆదేశాలిచ్చారు.

ఖానాపూర్​లో పట్టపగలే నడిరోడ్డుపై యువతి దారుణ హత్య

పోర్న్​ వీడియోలు చూసి చెల్లిపై అన్న రేప్​- ఎవరికైనా చెప్పేస్తుందని హత్య

సినిమాను తలపించేలా హత్య - వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను చంపించిన భార్య

Last Updated : Feb 8, 2024, 6:05 PM IST

ABOUT THE AUTHOR

...view details