young woman commits suicide In Hyderabad: హైదరాబాద్ రామంతాపూర్‌లో యువతి ఆత్మహత్య కలకలం రేపింది. స్థానిక డీఎస్‌ఎన్ మాల్‌లో పనిచేస్తున్న 24 ఏళ్ల యువతి హరిత బిల్డింగ్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇదే భవనంలో తొమ్మిదో అంతస్థులోని డీఎస్‌ఎన్ మాల్‌లో క్లయింట్ సర్వీస్ సొల్యూషన్స్‌లో హరిత కస్టమర్ రిలేషన్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోంది. తొమ్మిదో అంతస్థు నుంచి దూకడంతో గమనించిన సిబ్బంది వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. సమాచారం తెలుసుకున్న ఉప్పల్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. రామంతాపూర్‌లో జరిగిన ఘటన స్థానికంగా విషాదం నింపింది. మృతురాలి తండ్రి మాత్రం ఆర్థిక ఇబ్బందులతోనే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.