Young Man Committed To Suicide For Not Getting Job :కారణం చిన్నదో, పెద్దదో ఆత్మహత్యే దారి అనుకుంటున్నారు నేటి యువత. చిన్నచిన్న వాటికే జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. ప్రేమ, చదువు, పరీక్షలు, ఉద్యోగం, పెళ్లి ఇలా ఏదో ఒక సమస్యతో తనువు చాలిస్తున్నారు. కన్నవారు, తోబుట్టువుల కోసం ఆలోచించకుండా సమస్యకు అసలు పరిష్కారమే లేదన్నట్లుగా అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
తాజాగా ఓ యువకుడు కన్న కలలన్నీ కల్లలయ్యాయి. డిగ్రీ పట్టా పొంది మూడు సంవత్సరాలుగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా ఏవీ ఫలించలేదు. బేల్దారీ పనులు చేయలేక, ఇటు తల్లిదండ్రులకు భారం కాలేక ఏమీ చేయలేక తెలియక మనోవేదనకు గురయ్యాడు. తను పడుతున్న వేదనకు అక్షరూపమిచ్చి తనువు చాలించి, తల్లిదండ్రులకు కన్నీరు మిగిల్చాడు. ఈ హృదయ విదారక ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
సురేష్, మృతుడు (ETV Bharat) అందరిముందు అవమానం - ఆ స్టూడెంట్ను కఠినమైన నిర్ణయం తీసుకునేలా చేసింది
ముండ్లమూరు మండలం మారెళ్ల గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన వెల్లంపల్లి సురేష్ మూడేళ్ల కిందట డిగ్రీ పూర్తి చేశాడు. చదువు అనంతరం హైదరాబాద్‌లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఏవీ ఫలించకపోవడంతో అక్కడే ఉంటూ బేల్దారి పనులకు వెళ్తూ కాలం వెల్లదీస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం స్వగ్రామానికి వచ్చాడు. తల్లిదండ్రులు వేంపాడు వద్ద కౌలుకు తీసుకున్న పొలంలో పనులకు వెళ్లగా సురేష్ ఇంట్లోనే ఉన్నాడు. వారు అదేరోజు సాయంత్రం రాత్రి ఏడు గంటలకు ఇంటికి వచ్చారు. తలుపులు వేసి ఉండడంతో సురేష్‌ను పిలిచారు. ఎంత సేపటికి తీయకపోవడంతో కిటికీలోంచి చూడగా ఫ్యాన్ రాడ్డుకి కుమారుడి మృతదేహం వేలాడుతూ కనిపించింది. ఆందోళనకు గురైన వారు తలుపులు పగులగొట్టి సురేష్ మృతదేహం చూసి తల్లిదండ్రులు ఒక్కసారిగా హతాశులయ్యారు.
ఉత్తరం చెప్పిన విషయాలు : మృతదేహం పక్కనే సూసైడ్ నోటు కనిపించింది. అందులో తన చావుకి ఎవ్వరూ కారణం కాదని పేర్కొన్నాడు. తను డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం రాకపోవడంతో తల్లిదండ్రులు, అన్నయ్యకు ఎలాంటి సహాయం చేయలేకపోతున్నానని ఆ బాధతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో రాశాడు. ప్రేమించిన అమ్మాయికి ఇటీవల ఉద్యోగం వచ్చినా తనకు రాకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానికులు అంటున్నారు. ఎస్సై నాగరాజు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. బాధితుని తండ్రి యలమంద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
క్షణికావేశంలో భార్య, భయంతో భర్త ఆత్మహత్య - అనాథలైన ఇద్దరు చిన్నారులు
రామంతాపూర్‌లో తొమ్మిదో అంతస్థు నుంచి దూకి మహిళా ఉద్యోగి ఆత్మహత్య