Young Man Committed Suicide in Hyderabad : వారిద్దరు ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు. చెట్టాపట్టాలు వేసుకుని కలిసి తిరిగారు. నువ్వులేక నేను లేనంటూ ఇద్దరూ క్షణం విడిచిపెట్టి ఉండేవారు కాదు. కానీ ఇంతలోనే ఏం జరిగిందో తెలియదు. కొన్ని రోజులుగా ఆ ప్రేమికులు ఇద్దరూ గొడవపడ్డారు. ప్రేమికుల మధ్య చిన్న చిన్న గొడవలు అనేవి సహజం కానీ సడెన్‌గా ప్రేమికురాలితో గొడవ పడిన ప్రేమికుడు ఫోన్లో మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకుంటున్నాని చెప్పాడు. ఆ అమ్మాయి వెంటనే స్పందించి అతడి ఇండి సమీపంలో ఉన్న స్నేహితుడిని పంపింది. కానీ అప్పటికే అతడజు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పరమారెడ్డిహిల్స్‌లో జరిగింది. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం :వికారాబాద్ జిల్లా తాండూర్‌కు చెందిన ఇమ్రోజ్ పటేల్ కొన్నేళ్లుగా రాజేంద్రనగర్‌లోని పరమా రెడ్డి హిల్స్‌లో నివాసం ఉంటున్నాడు. ఓ ప్రైవేటు కంపెనీలో సాప్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన ఓ యువతిని ప్రేమించాడు. అప్పటివరకు బాగానే వారిద్దరు గడిపారు. ఇంతలో ఏం అయిందో తెలియదు కానీ కొన్ని రోజులుగా ఆ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తి మాట్లాడుకోవడం మానేశారు. ఈ క్రమంలో ఆ యువతి ఇమ్రోజ్ను దూరం పెట్టింది. ఈ విషయంపై ఇమ్రోజ్ పటేల్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పిన ప్రేమికుడు : ఆమెతో మాట్లాడకుండా ఉండలేక మంగళవారం రాత్రి ఇమ్రోజ్ పటేల్ తాను నివసించే ఫ్లాట్ నుంచి ఆ యువతికి ఫోన్ చేశాడు. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఆ యువతితో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. దీంతో భయభ్రాంతులకు గురైన ఆ అమ్మాయి వెంటనే అక్కడికి దగ్గరలో ఉండే మరో స్నేహితుడికి ఫోన్లో విషయం చెప్పింది. వెంటనే అతడిని ఇమ్రోజ్ పటేల్ ఫ్లాట్‌కు వెళ్లాలని సూచించింది.