Young Lyricist Virinchi Putla Success Story : సినీ పరిశ్రమలో అవకాశాలు రావడం అంత తేలిక కాదు. టాలెంట్ ఉన్నా, అవకాశం రావడానికి ఎన్నో తలుపులు తట్టాల్సి ఉంటుంది. వచ్చినా ఆ రంగంలోని ఒత్తిళ్లను ఎదుర్కొని ముందుకు సాగడం గగనమే. కారణం ఈ రంగంలో నెలకొన్న పోటీనే. అయినా తనకు ఇష్టమైన సినీ రంగంలోనే స్థిరపడాలనుకున్నాడు ఈ యువ రచయిత. సంగీతం వినిపిస్తున్న యువకుడి పేరు పుట్ట విరించి. కామారెడ్డి జిల్లా మల్కాపూర్‌కు చెందిన నిరుపేద కుటుంబంలో జన్మించాడు. సినీ నేపథ్యం, సినిమా వాళ్లతో పరిచయాలంటూ ఏమీ లేవు. కానీ సినీ పరిశ్రమలో అడుగుపెట్టాలనే తపనతో వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుంటున్నాడు.
Virinchi Putla Writes Songs :బాల్యం నుంచే ఈ యువకుడికి పాటలంటే మహా ఆసక్తి. వివిధ కార్యక్రమాల్లో బహుమతులు కూడా అందుకున్నాడు. 2013లో డిగ్రీ తర్వాత పట్నానికి ప్రయాణమయ్యాడు. ఒక్క ఛాన్స్ అంటూ సంగీత దర్శకుల చుట్టూ తిరిగాడు. కానీ ఎవరి దగ్గర సంగీతం నేర్చుకున్నావు? ఏ షోలో పాల్గొన్నావు? అనే ప్రశ్నలే ఎదురయ్యాయి తప్ప అవకాశాలు మాత్రం రాలేదు. అవకాశాల కోసం ఎదురుచూస్తున్న విరించిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి.
సంప్రదాయ పద్ధతిలో బేకరీ పదార్థాల తయారీ - ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరట!
Virinchi Putla Success Story :దాంతో పేపర్ బాయ్‌గా పని చేశాడు. ఉదయం స్టూడియోల చూట్టూ తిరుగుతూనే, రాత్రిళ్లు సెక్యూరిటీ గార్డుగా పని చేశాడు. క్యాటరింగ్, డెలివరీ బాయ్‌గానూ చేశాడు. చివరికి 2019లో ఒక ఛానెల్లో వ్యాఖ్యాతగా చేరాడు. కానీ ఎక్కడా మనోధైర్యాన్ని కోల్పోకుండా ప్రయత్నాలు కొనసాగించాడు. క్షణమొక యుగం అనే షార్ట్ ఫిల్మ్‌లో ఒక పాట రాశాడు. బాగా పేరొచ్చినా, అవకాశాలు రాలేదు. తర్వాత సుమనోహరం అనే ఆల్బమ్‌లో రాసిన ఓ పాటతో వెనక్కి తిరిగి చూసుకోలేదు. గాలోడు, హిడింబ వంటి సినిమాలకు అవకాశం వచ్చింది. పాటలు రాస్తూనే, మద్రాస్ విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు సాహిత్యం చదువుతున్నాడు ఈ యువ రచయిత.