Young India Skills University Introduced Three New Courses :యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కొత్తగా ఎండోస్కోపీ టెక్నీషియన్, ప్రొటోటైపింగ్, మెడికల్ కోడింగ్ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కోర్సుల్లో శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రైవేటు రంగంలో తెలంగాణ యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పరిశ్రమలను భాగస్వామ్యం చేస్తూ రాష్ట్ర ప్ర భుత్వం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించింది.
రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న 17 ప్రాధాన్య రంగాలు, పరిశ్రమల భవిష్యత్తు అవసరాలకు సరిపడే మానవ వనరులను తయారు చేసేలా కొత్త కోర్సులను ఐటీ, పరిశ్రమల శాఖ రూపొందించింది. ఫార్మా, నిర్మాణ, బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఈ కామర్స్ - లాజిస్టిక్స్, రిటైల్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్, గేమింగ్-కామిక్స్ తదితర కోర్సులు ఉన్నాయి. సంబంధిత రంగంలో పేరొందిన కంపెనీల భాగస్వామ్యంతో కోర్సులను రూపొందించి, యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఆయా కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. తాజాగా ఈ యూనివర్సిటీ కిమ్స్, ఏఐజీ ఆసుపత్రులు, టీ-వర్క్స్ భాగస్వామ్యంతో 3 కోర్సులకు నోటిఫికేషన్లను జారీ చేసింది. త్వరలో మరిన్ని కోర్సులను ప్రారంభించేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. కోర్సులకు సంబంధించి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వైఐఎస్‌యూ.ఇన్‌లో చూడాలి అని అధికారులు సూచిస్తున్నారు.
ఎండోస్కోపీ టెక్నీషియన్ ట్రైనింగ్ ప్రోగ్రాం
వ్యవధి: 6 నెలలు
అర్హత: ఇంటర్(బైపీసీ)లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత
వయసు: 25 ఏళ్లలోపు
శిక్షణ: ఎండోస్కోపీ ఆపరేషన్స్‌పై క్లాస్ రూం, ప్రాక్టికల్ ట్రైనింగ్
ఉపాధి అవకాశాలు: ఏఐజీ, ఇతర ఆసుపత్రుల్లో ప్లేస్‌మెంట్
ఫీజు: రూ.10 వేలు
ప్రొటోటైపింగ్ స్పెషలిస్ట్ ప్రోగ్రాం
వ్యవధి: 2 నెలలు