Degree Student Commits Suicide : పోలీసుల అదుపులో ఉండాల్సిన ఓ 18 ఏళ్ల యువకుడు రైలు పట్టాలపై శవమై తేలాడు. విషయం తెలుసుకున్న యువకుడి కుటుంబీకులు, బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఎస్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ శ్యాం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం గోపాలపురంలో జరిగిన ఘటన పూర్వాపరాలు బాధితుల కథనం మేరకు ఇలా ఉన్నాయి.
పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలానికి చెందిన డిగ్రీ విద్యార్థి ఓ గ్రామానికి చెందిన పదో తరగతి బాలికతో చనువుగా ఉండేవాడు. విషయం తెలిసిన బాలిక తల్లి యువకుడిని మందలించింది. మరోసారి ఇద్దరూ చనువుగా కనిపిస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించింది. అయినప్పటికీ ఇద్దరూ చనువుగా ఉంటూ మాట్లాడుకోవడం ఆమె కంటపడింది. దీంతో బాలిక తల్లి స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి విచారణ నిమిత్తం ఈ నెల 14న పోలీస్ స్టేషన్‌కు తీసుకుని వచ్చారు. ఈ క్రమంలో 15వ తేదీ తెల్లవారుజామున రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై శవమై తేలాడు.
SI and Constable Suspend: పోలీస్‌స్టేషన్‌లో యువకుడి ఆత్మహత్య.. ఎస్సై, కానిస్టేబుల్ సస్పెన్షన్