YCP Political Meeting at Tirumala Parveti Mandapam:హిందూ ధర్మ వ్యాప్తి సనాతన ధర్మ పరిరక్షణకు సలహాలు సూచనలు కోరుతూ తిరుమల ఆస్థాన మండపంలో పెద్ద ఎత్తున ధార్మిక సదస్సు ఓ వైపు తిరుమలలో పవిత్రమైన శ్రీవారి పార్వేటి మండపంలో అధికార వైసీపీ నేతలు కుల సంఘాల ఆత్మీయ సమావేశాలు మరో వైపు జరుగుతున్నాయి. హిందూ ధర్మం గురించి ఆర్భాటపు ప్రసంగాలు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా అధికార వైసీపీ నేతలు తమ రాజకీయ అవసరాలకు టీటీడీ భవనాలను వినియోగించుకుంటున్నారు.
నిబంధనల మేరకు తిరుమల కొండపై ఎన్నికల ప్రచారాలు నిషేధం. కాని వైసీపీ నేతలు భూమన అభినయ్ రెడ్డికి మద్ధతుగా కుల సంఘాలతో వైసీపీ సమావేశాలు నిర్వహించారు. తిరుమల పార్వేట మండపంలో కుల సంఘ సమావేశాన్ని నిర్వహించి తిరుమల శ్రీవారి పవిత్రను మంటగలిపారన్న విమర్శలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
తిరుమలలో డ్రోన్ కలకలం - మరోసారి బయటపడిన నిఘా వైఫల్యం
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కుమారుడు అభినయ్ రెడ్డిని గెలిపించుకునేందుకు టీటీడీ ఛైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే తిరుపతిలో తన కుమారుడి నేతృత్వంలో పలు కుల సంఘం నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా తిరుమలలోని పార్వేటి మండపంలో తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ ఒక సమావేశాన్ని నిర్వహించడం తీవ్ర వివాదాస్పదమవుతోంది. శనివారం ఉదయం పార్వేటి మండపంలో బలిజ సామాజిక వర్గానికి చెందిన వారితో సమావేశం నిర్వహించారు.