YCP MLA Followers Attack Woman in Anantapur:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దాష్టీకాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పార్టీ నేతల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. పార్టీ అండదండలతో బడుగు, బలహీన వర్గాలపై దౌర్జన్యాలు, దాడులకు పాల్పడుతున్నారు.
రాష్ట్రంలో అవినీతిలో, భూ కబ్జాల్లో, హత్యల్లో ఇల్లా అన్ని నేరాల్లో వైసీపీ నాయకులే ముందుంటున్నారు. వారి అక్రమాలపై ఎవరైనా ప్రశ్నిస్తే రాజకీయ పలుకుబడిని ఉపయోగించి వారిపై అక్రమ కేసులు పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇలా వారి అరాచకాలపై అడిగేవారు లేక రౌడీలుగా మారి అతి సామాన్యులపై ఇష్టానుసారంగా దాడులు చేస్తున్నారు. తాజాగా అనంతపురంలో ఓ మహిళ తమ కాలనీ సమస్యలపై వైసీపీ ఎమ్మెల్యేను ప్రశ్నించగా అతని అనుచరులు ఆ మహిళ ఇంట్లోకి చొరబడి మహిళ అని చూడకుండా దాడి చేశారు.
టీడీపీ సానుభూతిపరురాలిపై వైఎస్సార్సీపీ నేతల దాడి- వీడియో వైరల్
తాగునీటి సమస్య గురించి ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి అనుచరులు మహిళపై దాడి చేసిన ఘటన అనంతపురంలో కలకలం రేపింది. నగరంలోని పార్వతమ్మ కాలనీ పరిసర ప్రాంతాల్లో వైసీపీ నాయకులు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. 40వ డివిజన్ వైసీపీ కార్పోరేటర్ చింతకుంట మధు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అనంత వెంకట్రాంరెడ్డితో పాటు పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.