YCP Leader Perni Kittu Followers Attack On Karri Mahesh house: అధికార వైసీపీ నేతలకు, కార్యకర్తలకు అడ్డుఅదుపు లేకుండా పోతుంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ ప్రతిపక్షాలపై దాడులకు పాల్పుడుతున్నారు. ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులు వైసీపీ నేతలకు మద్దతుగా నిలుస్తున్నారు. మెున్న చిత్తూరు జిల్లాలో ప్రచారానికి వెళ్లిన బీసీవై నేతలపై దాడికి దిగిన వైసీపీ నేతలు, కార్యకర్తలు... తాజాగా నేడు, కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని జనసేన నేత ఇంటిపై దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా, ఇంట్లో ఉన్న మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించారు. ఇంటిపై దాడికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేస్తే, పోలీసులు స్పందించడం లేదంటూ జనసేన, టీడీపీ నేతలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జనసేన నేత కర్రి మహేష్ ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరులు దాడికి పాల్పడ్డారు. మచిలీపట్నంలో జనసేన నేత కర్రి మహేశ్ ఇంటిపై వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరులు దాడికి పాల్పడ్డారు. విశ్వబ్రాహ్మణ కాలనీలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన పేర్ని కిట్టు అనుచరులు, కర్రి మహేశ్ ఇంటి ముందు బాణసంచా కాల్చి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఇదేంటని ప్రశ్నించినందుకు కర్రి మహేష్ ఇంట్లోకి చొరబడి పేర్ని కిట్టు అనుచరుల దౌర్జన్యానికి పాల్పడ్డారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో కర్రి మహేశ్ కుటుంబసభ్యులు, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది.
టీడీపీ సానుభూతిపరురాలిపై వైఎస్సార్సీపీ నేతల దాడి- వీడియో వైరల్