ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇసుక తవ్వకాలు అడ్డుకున్నందుకు ట్రాక్టర్​తో తొక్కించారు- కత్తులు, రాడ్లతో హల్​చల్​ - YCP activists attacked villagers - YCP ACTIVISTS ATTACKED VILLAGERS

YCP Activists Attacked Locals for Obstructing Sand Mining: అధికార పార్టీ అండతో ఇసుక మాఫియా అక్రమాలకు అంతే లేకుండా పోయింది. అక్రమ తవ్వకాల వల్ల బోర్లు ఎండిపోతున్నాయని అడ్డుచెప్పిన గ్రామస్థులపై వైసీపీ కార్యకర్తలు ఇనుప రాడ్లతో విచక్షణా రహితంగా దాడిచేసి గాయపరిచారు. ట్రాక్టర్‌తో తొక్కించి చంపేందుకు యత్నించారు. గుంటూరు జిల్లా మున్నంగి రీచ్‌లో జరిగిన ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

ycp_activists_attacks
ycp_activists_attacks

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 30, 2024, 7:16 AM IST

Updated : Mar 30, 2024, 11:10 AM IST

YCP Activists Attacked Locals for Obstructing Sand Mining:రాష్ట్రంలో అధికార పార్టీ అండతో ఇసుక మాఫియా అక్రమాలకు అంతే లేకుండా పోయింది. ఎన్నికల కోడ్​ వచ్చినా అక్రమ ఇసుక తవ్వకాలకు అడ్డుకట్ట పడడం లేదు. ఇసుక అక్రమాలకు మరింత జోరు పెంచారు. అధికారుల సహకారంతో అడ్డగోలుగా అక్రమ ఇసుక తవ్వకాలను చేపట్టారు. అక్రమ తవ్వకాల వల్ల బోర్లు ఎండిపోతున్నాయని అడ్డుచెప్పిన గ్రామస్థులపై వైసీపీ కార్యకర్తలు ఇనుప రాడ్లతో విచక్షణా రహితంగా దాడిచేసి గాయపరిచారు. ట్రాక్టర్‌తో తొక్కించి చంపేందుకు యత్నించారు. గుంటూరు జిల్లా మున్నంగి రీచ్‌లో జరిగిన ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

ఇసుక తవ్వకాలు అడ్డుకున్నందుకు ట్రాక్టర్​తో తొక్కించారు- కత్తులు, రాడ్లతో హల్​చల్​

యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు - భారీ యంత్రాలతో తుంగభద్రకు తూట్లు - Illegal Sand Mining

ఇసుక మాఫియా మరోసారి బరితెగించింది. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగి రీచ్‌లో కొద్దిసేపు భయానక వాతావరణం సృష్టించింది. విచ్చలవిడిగా సాగుతున్న అక్రమ ఇసుక తవ్వకాల వల్ల గ్రామంలో బోర్లు ఎండిపోతున్నాయంటూ అడ్డుచెప్పిన స్థానికులపై వైసీపీ కార్యకర్తలు ఇనుప రాడ్లతో విచక్షణా రహితంగా దాడిచేశారు. అంతటితో ఆగకుండా వారిపై ట్రాక్టర్ ఎక్కించి హతమార్చేందుకు యత్నించారు. గ్రామస్థుల ద్విచక్ర వాహనాలను సైతం ట్రాక్టరుతో తొక్కించి ధ్వంసం చేశారు.

స్థానికంగా ఇసుక మాఫియా నడి పిస్తున్న ముఖ్య నాయకుడు దీని వెనుక ఉన్నట్లు తెలుస్తోంది. మున్నంగి రీచ్‌లో కొన్నాళ్లుగా ఇసుక అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటి, బోరుబావులు ఎండిపోతున్నాయని గ్రామస్థులు ఆందోళన చెందుతూ ఇసుక తవ్వకాలను అడ్డుకోవాలని నిర్ణయించుకున్నారు. అదే గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు ట్రాక్టర్లలో శుక్రవారం సాయంత్రం ఇసుకను తరలిస్తుండడంతో అడ్డుకున్నారు. రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు రాడ్లు, కర్రలతో దాడి చేశారు. గ్రామస్థుల ద్విచక్ర వాహనాలను ట్రాక్టర్‌తో ఢీకొట్టి ధ్వంసం చేశారు.

ఎన్నికల కోడ్​ కూసినా ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట పడదా ! - Krishna River Illegal Sand Mining

దాడిలో మున్నంగికి చెందిన వేమూరి బాలరాజు, వేమూరి అశోక్, కొండూరి మహేష్, వేమూరి మహేష్, మోజేషుకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను తెనాలి ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వారితో పాటు బాధితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కొన్నాళ్లుగా ఇసుక అక్రమ తవ్వకాలు ఆపాలని గ్రామస్థులు కోరుతున్నా అధికార యంత్రాంగం నుంచి స్పందన కరవైంది. గ్రామస్థులే జోక్యం చేసుకుని అడ్డుకోగా వారిపై ఇసుక మాఫియా దాడి చేసింది. దాడికి పాల్పడిన వారిలో స్థానికులు వేమూరి మోసయ్య, ఆయన కుమారుడు చింతయ్య ఉన్నట్లు బాధితులు తెలిపారు.

బాధితులపైన కూడా కేసులు: ఈ ఘటనలో ట్రాక్టర్‌తో తొక్కించినవారితోపాటు గాయపడినవారిపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. దాడికి పాల్పడిన వైసీపీకి చెందిన వేమూరి మోషే, వేమూరి చింతయ్య, సంజీవ్‌, మల్లికార్జున్‌, అంజిపై కేసులు నమోదయ్యాయి. అలాగే బాధితులైన బాలరాజు, వేమూరి అశోక్‌, రాజేష్‌పైనా పోలీసులు కేసులు పెట్టారు. రెండు గ్రూపుల మధ్య గొడవగా పోలీసులు చెబుతున్నారు.

ఎన్జీటీ ఆదేశాలు బేఖాతరు: వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రాష్టంలో ఇసుక దోపిడీకి అంతే లేకుండా పోయింది. సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్జీటీ ఆదేశించినప్పటికీ ఇసుక తవ్వకాలు ఆగడం లేదు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలకు ఎలాంటి డిజిటల్ పత్రాలు ఉండవు, డిజిటల్ పేమెంట్లు ఉండవు. రాతకోతలన్నీ చేతితోనే నేరుగా డబ్బులు ఇచ్చిన వారికే ఇసుక విక్రయాలు. కేంద్ర దర్యాప్తు సంస్థల చూపు ఒక్కసారి రాష్ట్రంపై పడిందా బినామీ సంస్థలు, వాటి వెనక ఉన్న సూత్రధారులు బయటకొస్తారు.

'జగ్గూ భాయ్‌' ధనదాహానికి బలైన కోనసీమ- ఎటు చూసినా అంతులేని అవినీతి

Last Updated : Mar 30, 2024, 11:10 AM IST

ABOUT THE AUTHOR

...view details