తెలంగాణ

telangana

ETV Bharat / state

కన్నుల పండువగా యాదాద్రీశుల వారి కల్యాణం - పారవశ్యంలో మునిగిన భక్తజనం

Yadadri Sri Lakshmi Narasimha Swamy Kalyanam 2024 : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 11 నుంచి వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రోజున కొండపై స్వామి అమ్మవార్ల కల్యాణ మహోత్సవం కన్నుల పండువుగా జరిగింది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున మంత్రులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

Yadadri Brahmotsavalu 2024
Yadadri Sri Lakshmi Narasimha Swamy Kalyanam 2024

By ETV Bharat Telangana Team

Published : Mar 19, 2024, 9:34 AM IST

యాదాద్రిలో కన్నుల పండువగా స్వామి వారి కల్యాణం - హాజరైన మంత్రులు తుమ్మల, కోమటిరెడ్డి

Yadadri Sri Lakshmi Narasimha Swamy Kalyanam 2024 : యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కల్యాణం కన్నుల పండువుగా జరిగింది. రాత్రి 8 గంటల 45 నిమిషాలకు ప్రారంభమైనకల్యాణ మహోత్సవం సుమారు రెండున్నర గంటల పాటు జరిగింది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున మంత్రులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు, పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కల్యాణాన్ని భక్తులు వీక్షించేందుకు ఆలయ పరిసరాల్లో ఎల్ ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.

Yadadri Brahmotsavam 2024 : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 11 నుంచి వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం కొండపై స్వామి అమ్మవార్ల కల్యాణ మహోత్సవం కన్నుల పండువుగా జరిగింది. ముందుగా గజవాహనంపై స్వామివారిని ఆలయ తిరు వీధుల్లో ఉరేగించి తిరు కల్యాణ మహోత్సవం నిర్వహించారు. అనంతరం కల్యాణ మండపంలో అర్చకులు స్వామి, అమ్మవార్లను అధిష్టింపజేసి కల్యాణ ఘట్టాన్ని ప్రారంభించారు. స్వామి వారి తిరు కల్యాణానికి ప్రభుత్వం తరపున మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

యాదాద్రి ఆలయంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు- వటపత్రశాయి అలంకారంలో స్వామివారు

Yadadri Kalyanotsavam 2024 :వేద పండితుల మంత్రోచ్ఛారణలు, వేదపారాయణాలు, మంగళవాయిద్యాల మధ్య నరసింహస్వామి వారు లక్ష్మీఅమ్మవారి మెడలో మాంగళ్యధారణ చేశారు. ఆ సమయంలో ఆలయ తిరువీధుల ప్రాంగణం నమో నారసింహ, జై నారసింహ, గోవిందా నామస్మరణతో మార్మోగింది. స్వామి అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని తిలకించిన భక్తులు ఆనందపరవశులైయ్యారు. ఆలయ పునర్‌నిర్మాణం తరువాత రెండోసారి ఈ వేడుకలు జరిగడంతో అధికారులు తగు జాగ్రత్త తీసుకున్నారు. స్వామి వారి కల్యాణం కొండపై ఆలయ సన్నిధిలో నిర్వహించడంతో భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ మాడవీధులు భక్తులతో నిండిపోయాయి.

స్వామివారి కల్యాణాన్ని భక్తులు వీక్షించేందుకు ఏర్పాట్లు : సోమవారం రాత్రి 11.01 నిమిషాలకు లోక కల్యాణం, జగత్ రక్షణ కోసం స్వామివారు లక్ష్మీదేవి మెడలో మంగళ సూత్రధారణ గావించారని, స్వామివారి కరుణాకటాక్షములు అమ్మవారితో పాటు సమస్త లోకాలు సంతరిస్తాయని ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీ చార్యులలు చెప్పారు. కల్యాణాన్ని భక్తులు వీక్షించేందుకు ఆలయ పరిసరాల్లో ఎల్ ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాలు వివిధ రకాల పూలు, విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయంలో రద్దీ దృష్ట్యా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. స్వామివారి కల్యాణాన్ని చూడటానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

నేడు యాదాద్రిలో శ్రీలక్ష్మీనరసింహ స్వామి కల్యాణం - సర్వాంగ సుందరంగా ముస్తాబైన ఆలయం

యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయ ఇన్‌చార్జ్ ఈఓ రామకృష్ణరావుపై బదిలీ వేటు

ABOUT THE AUTHOR

...view details