Yadadri Brahmotsavam 2024 : రాష్ట్రంలో మరో తిరుమల క్షేత్రంగా కొలువై విరాజిల్లుతున్న యాదాద్రీశుల వైభవం నలుదిశల్లోని భక్తజనులను అలరింపజేస్తుంది. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను రెండోసారి నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి రోజు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో(Revanth Reddy) పాటు పలువురు రాష్ట్ర మంత్రులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు.
Yadadri Temple Varshika Brahmotsavam 2024 : ఈ నెల 17న స్వామివారి ఎదుర్కోలు, 18న స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం, 19న స్వామివారి దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు, స్వస్తి పుణ్యహవాచనంతో శాస్త్రోక్తంగా ఆరంభమై, ఈ నెల 21వ తేదీ అష్టోత్తర శతఘటాభిషేక పూజలతో ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి తెలుగు రాష్ట్రాల(telugu States) నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు.
యాదాద్రి పాతగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం - 25 వరకు వేడుకలు
Yadadri Temple Annual Brahmotsavam : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలపై ఈఓ రామకృష్ణeరావు సిబ్బందితో సమావేశం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు నిర్వహణకు భారీగా ఖర్చు చేస్తున్నామన్నారు. తిరుకల్యాణోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతుల ప్రభుత్వం(Governmnt)తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పిస్తారన్నారు. ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ ఈఓ కోరారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 11నుంచి 21వ తేదీ వరకు పలు సేవలను అధికారులు(Officials) రద్దు చేశారు