Women Fight For Seat In TGSRTC Bus : ఆర్టీసీ బస్సులో సీట్ కోసం మహిళలు ఘర్షణ పడిన ఘటన వనపర్తి జిల్లా ఖిల్లాగణపురం ప్రయాణ ప్రాంగణంలో చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు పరస్పరం చీపురు కట్టలతో, కర్రలతో దాడి చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. చివరకు తోటి ప్రయాణికులు కలగజేసుకుని అతి కష్టం మీద వారిని చెదరగొట్టడంతో కథ సుఖాంతమైంది.
ఇదీ జరిగింది : మహబూబ్‌నగర్ నుంచి వనపర్తికి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఇద్దరు మహిళలు సీట్ కోసం బస్సులోనే గొడవపడ్డారు. బస్సు బస్‌స్టాప్ వద్దకు రాగానే అందులో నుంచి దిగిన కొందరు మహిళలు వెంటనే పరస్పరం దాడి చేసుకోవడం మొదలుపెట్టారు. జుట్లు పట్టుకుని చీపుర్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. తోటి ప్రయాణికులు కలుగజేసుకుని మహిళలను చెదరగొట్టారు.