Woman Commits Suicide After Failing to Pay Home Loan in Jangaon :ఎక్కడ పని చేసినా అందరూ కోరుకునేది ఒక్కటే సొంత ఇళ్లు. కడుపు నిండ తిండి. అందరూ కష్టపడేది అందుకే. ఆ దంపతులూ అదే కోరుకున్నారు. సొంతిల్లు కట్టుకుని సంతోషంగా జీవించాలి అనుకున్నారు. పిల్లలకు ఏ లోటూ లేకుండా చూసుకోవాలని కలలు కన్నారు. ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలో లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నారు. మొదట్లో కిస్తీలు బాగానే కట్టినా, తర్వాత వారిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి. రుణం తీర్చడం లేదని సంస్థ నోటీసులు ఇవ్వడంతో ఇంత కష్టపడి కట్టుకున్న ఇల్లు పోతుందని మనస్తాపంతో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన జమగామ జిల్లాలో చోటుచేసుకుంది.
ఆర్థిక సమస్యలు తలెత్తడంతో :ధర్మసాగర్ ఎస్ఐ జానీ పాషా తెలిపిన వివరాలు, మహిళ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, జనగామ జిల్లా ష్టేషన్ ఘన్పూర్కు చెందిన అంగడి ఎలేంద్ర దుకాణాల వద్ద చీపురు కొడుతూ, భర్త ఉపేందర్ ఓ మాంసం కొట్టులో పని చేసున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఎప్పటి నుంచో వీరు సొంతిళ్లు కట్టుకోవాలని అనుకున్నారు. అందుకు ఆరేళ్ల కిందట ఓ ప్రైవేట్ సంస్థ నుంచి రూ.15 లక్షలు లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నారు. కాగా ఇప్పటి వరకు రూ.3 లక్షల వరకు ఈఎంఐలు చెల్లించారు. తర్వాత ఆర్థిక ఇబ్బందులతో కిస్తీలు కట్టలేకపోయారు. వారు చెల్లించలేకపోయేసరికి ఫైనాన్స్ సంస్థ వారు గురువారం ఇంటికి వచ్చి నోటీసులు అంటించారు.
భార్యాభర్తల ప్రాణం తీసిన రూ.200 - వారి ఆత్మహత్యకు అదే కారణమా?