TG Ex MLA Teegala krishna Reddy Join In TDP : త్వరలో టీడీపీలో చేరతానని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తెలిపారు. పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబును ఆయన నివాసంలో తీగల కలిశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. చంద్రబాబు, టీడీపీ వల్లే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందన్నారు. తెలంగాణలో టీడీపీ అభిమానులు చాలా మంది ఉన్నారని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబును మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు, ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి కలిశారు. తన మనవరాలి వివాహానికి చంద్రబాబును ఆహ్వానించినట్లు మల్లారెడ్డి తెలిపారు. అయితే మీడియాతో మాట్లాడేందుకు మల్లారెడ్డి నిరాకరించారు.
"తెలంగాణలో టీడీపీ పూర్వ వైభవానికి తీసుకు వచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నాల్లో ఉన్నారు. ఆంద్రప్రదేశ్లో మళ్లీ చంద్రబాబు సీఎం కావడం సంతోషకరమైన విషయం. హైదరాబాద్ అభివృద్దికి బాబు ఎంతగానో కృషి చేసారు. హైదరబాద్ ఐటీ రంగం ఆయన వల్లే అభివృద్ది చెందింది. తెలంగాణలో నేడు పాలన ఎలా ఉందో అందరికీ తెలుసు. పూర్వ వైభవాన్ని మళ్లీ తెలంగాణలో తీసుకొస్తాం. టీడీపీ అభిమానులు తెలంగాణలో చాలామంది ఉన్నారు."-తీగల కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే